భారత దేశంలో బంగారం ధరలు ఎప్పుడూ ఎలా ఉంటాయో చెప్పలెము.. రోజుకో ధరలు మార్కెట్ లో నమోదు అవుతూన్నాయి.. నిన్న మొన్నటివరకూ భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో భారీగా కిందకు వచ్చాయని నిపుణులు అంటున్నారు.. రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ధరలలొ భారీగా మార్పులు వచ్చాయని తెలుస్తుంది. మొదట్లో భారీగా పెరిగిన ధరలు ఇప్పుడు మాత్రం వరుసగా కిందకు దిగి వస్తున్నాయి.. ఇది నిజంగానే మహిళలకు ఊరట కలిగించే విషయం అని చెప్పాలి.. అయితే నేడు పసిడి ధరలు కిందకు దిగి వస్తే వెండి ధరలు మాత్రం కాస్త పెరిగాయి.


కాగా,ఈరోజు నమోదు అయిన పసిడి ధరలను పరిసీలిస్తె మాత్రం.. భారత దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర 47,300 వద్ద కొనసాగుతుంది..ఇక నిన్నటి ధరలతో పోల్చితే 10 గ్రాముల బంగారంపై  400 రూపాయలు ధర తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే 51,600 రూపాయలుగా ఉంది. నిన్నటి ధరతో పోల్చి చూస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 440 రూపాయలు కిందకు దిగి వచ్చింది. మొత్తానికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇండియా లోని హైదరాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్ కతా నగరాల్లో ఈ ధరలు నమోదు అవుతూన్నాయి. ప్రాంతాలను ఆధారంగా ధరలలో కొద్దిగా మార్పులు ఉండే అవకాశం ఉంటుంది.


గత నెలతో పోల్చి చూస్తే బంగారం ధర ఊహించని స్థాయిలో పెరిగింది. కేవలం ఒకనెల లోనే ఇలా బంగారం ధరలు పెరగడం ఆశ్చర్యంగా వుంది ఇక ముందు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. దేశంలోని బంగారం ధరలపై పలు అంశాలు ప్రభావం చూపుతాయనే సంగతి తెలిసిందే. బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు మాత్రం కాస్త పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర 67,300 గా నమోదు అవుతుంది. నిన్నటి ధరలతో పోల్చి చూస్తే వెండి ధర 100 మేర పెరిగింది. ముంబై, ఢిల్లీ, కోల్ కతా నగరాల్లో అదే ధర నమోదు కాగా, హైదరాబాద్ లో మాత్రం కిలో వెండి 72,500 రూపాయలుగా ఉండటం విశేషం..రేపు మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: