పసిడి ధరలు ఎప్పుడూ ఎలా ఉంటాయో మార్కెట్ లో  అంచనా వెయ్యడం ఎవరి వల్ల కాదు.. నిమిషాల వ్యవధిలో రేటు లో ఎంతో కొంత మార్పు వస్తుంది. ఈ వారంలో మూడు రోజులు భారీగా పెరిగిన పసిడి ధరలు..నిన్న మార్కెట్ లో కూడా భారీగా పైకి కదిలాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. .. భారీగా బంగారం ధరలు పెరిగాయి. అదే విధంగా బంగారం ధరల దారిలో వెండి ధరలు కూడా నడిచాయి. మహిళలకు ఇది చేదు వార్త  అనే చెప్పాలి.. అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం పసిడి, వెండి ధరలు కూడా అదే విధంగా భారీగా పెరిగాయి.


ఇక గురువారం మార్కెట్ లో ధరలను పరిసీలిస్తె.. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర పై 427 రుపాయిలు పెరిగినట్లు తెలుస్తుంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,800 ఉంది, 24 క్యారెట్ల ధర రూ.52,303గా నమోదు అయ్యింది. అదే సమయంలో ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,330 వద్ద ఉంది. ఇకపొతె చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.50,220 ఉంది.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,770గా ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,800 ఉంది, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330గా ఉంది.


 బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 నమోదు అవ్వగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330గా ఉంది.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.49,800 ఉంది, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330గా కొనసాగుతుంది.. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 ఉంది, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,330గా కొనసాగుతుంది.. ప్రముఖ నగరాల్లో ఇలానే బంగారం ధరలు నమోదు అవుతున్నాయి. పసిడి ధరల దారి లోనే వెండి ధరలు పయనించాయి. వెండి ధరలు ఏకంగా రూ. 2,100 పెరిగాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.76,700గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో పసిడి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: