దాదాపు 40% వరకు పెరుగుదల నమోదైంది. ఈ పరిస్థితుల్లో బంగారం కొనాలంటే చాలా మందికి భయమేసే పరిస్థితి వచ్చింది.
అంతేకాదు, "ఫ్యూచర్లో బంగారం రేట్లు ఇంకా ఆకాశాన్ని తాకుతాయి" అంటూ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. మరోవైపు, వెండి రేట్లు కూడా భారీగా పెరగబోతున్నాయని హెచ్చరిస్తున్నారు. దీంతో చాలామంది వెంటనే బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. కొంతమంది వద్ద డబ్బు ఉంటే సరిగ్గా ప్లాన్ చేసుకుని కాయిన్స్, జ్యువెలరీ రూపంలో కొనుగోలు చేస్తుంటే, మరికొంత మంది మాత్రం ఆస్తులు తాకట్టు పెట్టి అయినా కొనుగోలు చేస్తున్నారు. వాళ్ల లాజిక్ ఏమిటంటే — "ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం ముందుగానే పెట్టిన పెట్టుబడి" అని నమ్ముతారు. అయితే, మరోవైపు కొంతమంది ఫైనాన్షియల్ అనలిస్టులు మాత్రం హెచ్చరిస్తున్నారు — "బంగారం రేట్లు ఇంత పెరిగిన తర్వాత త్వరలోనే 30 నుండి 40 శాతం వరకు పడిపోవచ్చు, కాబట్టి తొందరపడి పెట్టుబడులు పెట్టొద్దు" అంటున్నారు. వాళ్ల అంచనా ప్రకారం వచ్చే ఒకట్రెండు సంవత్సరాల్లో బంగారం రేటు భారీగా క్రాష్ అవుతుందట.
కానీ ఇదే విషయంపై మహిళల ఆలోచనా విధానం మాత్రం టోటల్ వేరుగా ఉంది. వాళ్ల లాజిక్ వింటే ఎవరికైనా షాక్ అవ్వాల్సిందే. “మేము మా ఆస్తులు తాకట్టు పెట్టి బంగారంలో పెట్టుబడులు పెట్టాం. ఇప్పుడు రేట్లు తగ్గిపోతే మాకు పెద్ద నష్టం వస్తుంది. కాబట్టి బంగారం రేట్లు తగ్గకూడదు... తగ్గితే అసలు ఊరుకోం!” అని హెచ్చరిస్తున్నారు. ఇంకా కొంతమంది మహిళలు మాత్రం బంగారం రేటు తగ్గినా కూడా పెద్దగా మారదని, “అది ఎక్కువలో ఎక్కువ ఐదు, పది వేలే తగ్గుతుంది. కానీ బంగారం 50 వేల కంటే తక్కువకు అసలు రాదు. అది లాస్ కాదు, లాభమే!” అని గట్టి విశ్వాసంతో మాట్లాడుతున్నారు.
దీంతో చాలామంది ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు — ఇప్పుడే బంగారంలో పెట్టుబడి పెట్టాలా? లేక వేచి చూడాలా? కొంతమంది “బంగారం అంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్” అంటుంటే, ఇంకొంతమంది “బంగారం కంటే ల్యాండ్ మీద పెట్టుబడి పెడితే లాభాలు ఎక్కువ” అని సూచిస్తున్నారు. మొత్తానికి ఈ మధ్య సోషల్ మీడియాలో మహిళల ఈ మైండ్‌బ్లోయింగ్ లాజిక్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. “ఇలా కూడా ఆలోచిస్తారా?” అని కామన్ పీపుల్ కామెంట్స్ చేస్తున్నారు. “మేము పెట్టిన డబ్బు సేఫ్‌గా ఉండాలంటే బంగారం రేట్లు తగ్గకూడదు!” అంటున్న మహిళల మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రెండింగ్ హాష్ట్యాగ్స్తో వీడియోలు, రీల్స్, మీమ్స్ వరదలా వచ్చేస్తున్నాయి. మొత్తానికి చూస్తే, బంగారం రేట్ల పెరుగుదలతో పాటు మహిళల ఆలోచనా రీతీ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది..!