ప్రస్తుతం ఎక్కడ చూసినా దోమల బెడద రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఏదో దోమలకి మనుషులకి ఎన్నో జన్మల బంధం ఉన్నట్లు బద్ద శత్రువులు గా వ్యవహరిస్తూ ఉంటాయి. మనుషులను ప్రశాంతంగా ఉండనివ్వకుండా చెవి దగ్గర సౌండ్ చేయడమే కాదు ఇక ఎక్కడపడితే అక్కడ కుడుతూ రక్తం పీల్చేస్తూ ఉంటాయి. దీంతో దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు జనాలు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అటు టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు చూసి ఎన్నో దోమల కాయిల్స్ ఉపయోగిస్తూ ఉంటారు జనాలు. అయినప్పటికీ దోమల బెడద మాత్రం తగ్గదు అనే చెప్పాలి. దీంతో ఇటీవల కాలంలో దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు కిటికీలు తలుపుల దగ్గర దోమతెరలు పెట్టుకొని వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందరు. అయితే  దోమల గురించి దాదాపు అందరి లో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దోమలు పగబట్టి నట్టుగా కొంతమంది వ్యక్తులనే ఎక్కువగా ఎందుకు కుడతాయి.. ఇక ఇన్ని జీవరాసులు ఉండగా ఎక్కువగా మనుషుల రక్తం ఎందుకు పిలుస్తాయ్ అని అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. అయితే బాగా బ్రైట్ గా ఉండే బట్టలు వేసుకున్న వారిని తొందరగా  గమనించి దోమలు కుడతాయ్ అన్న విషయాన్ని అప్పట్లో ఒక అధ్యయనంలో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.


 కేవలం మనుషులనే ఎందుకు దోమలు ఎందుకు కుడతాయి అన్న విషయంపై కూడా ఒక సరికొత్త అధ్యాయం చేసి ఆసక్తికర విషయాలు వెల్లడించారు శాస్త్రవేత్తలు.  అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో మనిషి రక్తాన్ని దోమలు ఎందుకు ఇష్టంగా తాగుతాయ్ అన్న విషయం వెల్లడైంది. మనిషి వాసనా దోమలకు నారింజ పుల్లటి వాసనగా అనిపిస్తుందట. అందుకే ఆ వాసన రాగానే మనిషి ఎక్కడున్న పసిగట్టి వచ్చి రక్తాన్ని పీల్చేస్తూ ఉంటాయట. ఇక ఇతర జంతువులలో అలాంటి వాసన రాకపోవడంతో జంతువుల జోలికి పోకుండా ఉంటాయట దోమలు..

మరింత సమాచారం తెలుసుకోండి: