అసలే గత మూడు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను హరింప చేస్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది నుంచి మనశ్శాంతిగా ఉన్న ప్రజలకు మళ్లీ ఇప్పుడు కరోనా భయం చుట్టుకుంది. కొత్త కరోనా వైరస్ ప్రజలను కబళించడానికి కోరలు చాచుతోంది . చాప కింద నీరుల విస్తరిస్తున్న ఈ వైరస్ ను అడ్డుకోవాలి అంటే ముందుగా.. మనం పరిశుభ్రతను పాటించడమే కాదు మన శరీరానికి కావలసిన రోగనిరోధక శక్తిని కూడా అందించాలి. అప్పుడే ఎటువంటి వైరస్ నైనా మన శరీరం అడ్డుకుంటుంది.

ప్రతిరోజు మన ఆహారంలో పోషకాలు కలిగిన ఆహార పదార్థాలతో పాటు కోడిగుడ్డు కూడా చేర్చుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి.  ముఖ్యంగా కోడిగుడ్డులో విటమిన్ బి 6,  విటమిన్ బి12,  విటమిన్ ఏ,  విటమిన్ ఈ,  విటమిన్ డి తో పాటు కాల్షియం, మెగ్నీషియం, జింక్ , కాపర్, పొటాషియం, థయామిన్ వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి.  అంతేకాదు ప్రతిరోజు గుడ్డు తీసుకోవడం అనేది మంచి అలవాటు అని వైద్యులు కూడా చెబుతున్నారు.

స్వతహాగా గుడ్డు ఒక మంచి పోషకాహారం. చిన్న పిల్లలతో పాటు వయసు పైపడిన వారు కూడా గుడ్డును తినవచ్చు. ఇది ఎదిగే పిల్లలకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది. పోషకాహార లోపంతో బాధపడేవారు ప్రతిరోజు గుడ్డు తీసుకోవడం మంచిది. గుడ్డులో ఉండే ప్రోటీన్స్ వల్ల లభించే కెలరీలు వల్ల మన శరీరానికి బరువు పెరగని బలాన్ని ఇస్తాయి. అందువల్ల బరువు తగ్గాలని అనుకునేవారు తమ  డైట్లో గుడ్డును చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.ఇది మన శరీరానికి అవసరమైన పోషకాలను,శక్తిని ఇస్తుంది. అందువల్ల అది మన పనికి సహకరిస్తుంది.

అంతేకాకుండా..మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే ఫాస్పరస్ మన ఎముకల దృఢత్వానికి సహాయం చేస్తుంది. ముఖంపై ముడతలను నివారించి చర్మ  ఆరోగ్యాన్ని పెంచుతుంది.విటమిన్ డి సహజంగా అందే ఆహారం గుడ్డు. గుడ్డు నరాల  వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: