
రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కిన కాంతార చాప్టర్1 సినిమాకు సంబంధించి ప్రీమియర్స్ ప్రదర్శితం అయ్యాయి. 2022 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన కాంతార మూవీ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అద్భుతాలు చేయగా కాంతార చాప్టర్1 ఏకంగా 125 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. ట్రైలర్ విషయంలో పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో లేదో ఇప్పుడు చూద్దాం.
కథ :
కాంతార సినిమా ఎక్కడైతే ముగిసిందో కాంతార చాప్టర్1 అక్కడే మొదలైంది. శివ (చైల్డ్ రిషబ్ శెట్టి) తండ్రి బర్మ ( రిషబ్ శెట్టి) మాయం కావడం వెనుక దశాబ్దాల చరిత్ర ఉంటుంది. బంగారు రాజ్యానికి సమీపంలో ఉండే కాంతార సుగంధ ద్రవ్యాలకు ప్రఖ్యాతిగాంచింది. ఈ ప్రాంతానికి కాపలాగా బ్రహ్మ రాక్షసుడు ఉంటాడు. అక్కడికి వెళ్లోద్దని తండ్రి చెప్పినా వినకుండా కులశేఖర్ (గుల్షన్ దేవయ్య) కాంతారపై కాలు మోపడంతో అక్కడ ఊహించని సంఘటనలు జరుగుతాయి. బందరులో బిజినెస్ చేయాలని అనుకున్న బర్మకు కనకావతి (రుక్మిణి వసంత్) సహాయ సహకారాలు అందిస్తుంది.
కాంతార వాసులు రాజ్యంలో వ్యాపారం చేయడం ఇష్టం లేని రాజు ఏం చేశాడు? కాంతార ప్రాంతంలో ఉన్న శక్తి ఏంటి? కాంతారపై రాజు పగబట్టడానికి కారణమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ:
కాంతార సినిమాకు ప్రీక్వెల్ అంటే ఈ సినిమా కాంతార సినిమాను మించి ఉంటుందని ఆశిస్తాం. ఆ అంచనాలను మించి కాంతార చాప్టర్1 ఉంది. కాంతారను నాశనం చేయాలని అనుకున్న వాళ్లపై కాంతారలో కొలువై ఉన్న దైవం ఏం చేశారనే కథతో ఈ సినిమా తెరకెక్కింది. కాంతార ప్రీక్వెల్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. సినిమాలో గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఎక్కువగానే ఉన్నాయి. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.
బర్మ, కనకావతి మధ్య లవ్ స్టోరీ కొత్తగా ఉంది. కథలో ఎన్నో అంశాలను టచ్ చేసినా ప్రతి సీన్ ప్రత్యేకంగా ఉండేలా ఈ సినిమా ఉంది. మ్యూజిక్, బీజీఎమ్ ఈ సినిమాకు ప్రాణం పోశాయి. దైవిక శక్తితో కూడిన క్లైమాక్స్ ఈ సినిమాకు బలం అని చెప్పవచ్చు. ఈ సినిమాలో పూనకాలకు సంబంధించిన సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. చాముండి అవతారానికి సంబంధించిన సీన్ సినిమాలో బాగుంది.
దసరా పండుగ కానుకగా విడుదల చేయడం ఈ సినిమాకు అదనపు అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. రుక్మిణి వసంత్ లుక్స్ బాగున్నాయి. రుక్మిణి వసంత్ భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ గా సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది. కాంతార ఆత్మ పోకుండా కొత్త కథను అద్భుతంగా తెరపై చూపించడంలో రిషబ్ శెట్టి సక్సెస్ అయ్యారు. టెక్నీకల్ గా సైతం ఈ సినిమా స్ట్రాంగ్ గా ఉంది.
అజనీష్ లోకనాథ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. దైవత్వంతో కూడిన పాటలు బాగున్నాయి. నెక్స్ట్ లెవెల్ లో ఉన్న క్లైమాక్స్ వావ్ అనేలా ఉంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో కామెడీ కూడా ఉంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఇతర విభాగాలు టాప్ రేంజ్ లో ఉన్నాయి. హీరోగా, డైరెక్టర్ గా రిషబ్ శెట్టి న్యాయం చేశారు. కాంతార1 ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.
రేటింగ్ : 3.5/5.0