అరటి పండ్లు రుచికి ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే సాధారణంగా వీటిని మనం కొన్నప్పుడు పసుపు రంగులో ఉంటాయి. కానీ కేవలం 1-2 రోజుల్లోనే అవి బాగా పండి మురిగిపోయి పాడై పోతాయి. అలాగే నల్లని మచ్చలు వాటిపై బాగా ఏర్పడుతాయి.అయితే నల్లని మచ్చలు ఉండే పండ్లు మంచివే అయినా ఇవి ఎక్కువ రోజుల పాటు ఉండవు.చాలా త్వరగా పాడవుతాయి. అందుకే అరటి పండ్లను ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేసుకొని ఈ పండ్లను ఎప్పుడైనా సరే పాడవకుండా తాజాగా తినాలనుకునేవారికి కింద తెలిపిన కొన్ని టిప్స్ పాటిస్తే  ఎల్లప్పుడూ పాడవకుండా తాజాగా ఉంచుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు ఏం చెయ్యాలో తెలుసుకుందాం.ఇక ఈ అరటి పండ్లు త్వరగా పాడవకుండా ఉండాలంటే వాటిని నిమ్మజాతికి చెందిన పండ్లకు అంటే బత్తాయి, ఆరెంజ్, నిమ్మకాయ వంటి పండ్ల దగ్గరగా ఉంచాలి. ఎందుకంటే ఆ పండ్లలో ఉండే సిట్రిక్ యాసిడ్ పండ్లు త్వరగా పాడవకుండా చేస్తుంది.ఇంకా అలాగే అరటి పండ్లను డీప్ ఫ్రిజ్‌లో కూడా మీరు పెట్టవచ్చు. అందువల్ల అవి గడ్డ కడతాయి.


దాని ఫలితంగా అవి త్వరగా పాడవకుండా ఎప్పటికీ అలాగే ఫ్రెష్ గా ఉంటాయి. తరువాత వాటిని బయటకు తీసి మంచు మొత్తం కరిగిన తరువాత వాటిని తినవచ్చు. ఇలా అరటి పండ్లను ఎక్కువ రోజుల పాటు మీరు తాజాగా ఉంచుకోవచ్చు.ఇంకో పద్ధతి ఏంటంటే అరటి పండ్లను ఒక పాలిథీన్ లేదా ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి మూతలా చుట్టాలి. తరువాత ఆ కవర్‌ను మీరు ఫ్రిజ్‌లో ఉంచాలి. దీంతో అరటి పండ్లు అంత త్వరగా పాడవవు. ఇంకా ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి. అలాగే అరటి పండ్లను ఇతర పండ్లు లేదా కూరగాయలతో కలిపి అస్సలు ఉంచరాదు. అలా ఉంచితే అవి చాలా త్వరగా పాడవుతాయి. కాబట్టి అరటి పండ్లను ప్రత్యేకంగా ఇంకో చోట పెట్టాలి. ఇంకా అలాగే అరటి పండ్లను ఓపెన్‌గా గాలి తగిలేలా అస్సలు ఉంచరాదు. అలా ఉంచితే పాడవుతాయి. కాబట్టి మూత ఉంచాలి. లేదా వాటిని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పెట్టాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: