మన జీవక్రియను మెరుగుపరచడానికి హెర్బల్ టీలు తాగడం చాలా సులభమైన మంచి మార్గం. అల్లం, దాల్చిన చెక్క ఇంకా యాలకులు వంటి మూలికల నుంచి తయారైన టీలని సహజమైన సేంద్రీయ తేనెతో కలిపి తాగాలని ఆయుర్వేదం  చెప్తుంది. అలాగే వాపును తగ్గించడంలో సహాయపడే శోథ నిరోధక లక్షణాలను కూడా ఇది కలిగి ఉంటుంది.ఇంకా అలాగే టాక్సిన్స్ తొలగించడంలో తేనె శరీర నిర్విషీకరణకు సహాయపడుతుంది. ఇది లిపిడ్ జీవక్రియను ఆప్టిమైజ్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య పరిస్థితులను కూడా బాగా మెరుగుపరుస్తుంది.ఇంకా అలాగే ముడి తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరం ఆహారాన్ని సంరక్షించడంలో బాగా సహాయపడతాయి. అలాగే కణాల క్షీణత నుంచి కాపాడతాయి.ఇంకా అలాగే సోంపు గింజలు  జీర్ణక్రియని మెరుగుపరిచి వాపును తగ్గించడంలో చాలా అద్భుతంగా పని చేస్తాయి. ఇవి పిత్త దోషాన్ని సమతుల్యం చేసి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. భోజనం చేసిన తర్వాత సోంపు గింజలు ఒక టీ స్పూన్ నమలండి.


లేదంటే ఒక కప్పు నీటిలో ఐదు నిమిషాల పాటు ఉడకబెట్టి వాటిని టీ చేసుకుని తాగవచ్చు.అలాగే మెంతి గింజలనేవి మొండి కొవ్వుని కరిగించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి.ఈ మెంతులు రాత్రిపూట నానబెట్టి ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి. ఇవి జీవక్రియ రేటును బాగా పెంచుతాయి. అలాగే ఎక్కువ ఆకలిని అరికడుతుంది. ఇంకా టాక్సిన్స్ను బయటకు పంపించి కొవ్వును కూడా ఈజీగా కరిగించేంస్తుంది.అలాగే జీర్ణక్రియ, ఆమ్లత్వం నుంచి తక్షణ ఉపశమనం కోసం వాము చాలా చక్కగా ఉపయోగపడుతుంది.అలాగే ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కేలరీలను బర్న్ చేయడం ద్వారా బరువుని ఈజీగా తగ్గిస్తాయి.యోగా, శ్వాస వ్యాయామాలు ఇంకా ధ్యానంతో జీవక్రియని పెంచుకోవచ్చు. ఇది మొత్తం ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరిచేందుకు సహకరించే చాలా అద్భుతమైన మార్గం. యోగా భంగిమలు ఇంకా ఆసనాలు జీర్ణక్రియను సజావుగా సాగేలా చేస్తాయి. రక్త ప్రసరణ బాగా జరిగి యాక్టివ్ గా ఉండేలా బాగా సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: