ఇటీవల కాలంలో ఆల్కహాల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారిపోయింది.  ఊపిరి పీల్చుకోవడం, ఆహారం తీసుకోవడం,  నీరు తాగడం అనేది ప్రతిరోజు ఎలా అయితే అలవాటుగా మార్చుకున్నారో.. ఇక మద్యం తాగడం విషయాన్నీ కూడా అలాగే అలవాటుగా మార్చుకున్నారు చాలామంది. అయితే ఒకప్పుడు మద్యం ఎక్కువగా తాగే వారిని కాస్త విచిత్రంగా చూసేవారు.. వారిపై  తాగుబోతు అంటూ ముద్ర వేసి అతనితో సరిగా మాట్లాడే వారు కూడా కాదు.. కానీ ఇప్పుడు మాత్రం ఎవరైతే తాగకుండా మద్యానికి దూరంగా ఉంటారో వారిని విచిత్రంగా చూస్తున్నారు. అంతేకాదు ఇలా మద్యం అలవాటు లేని వారితో సరిగా మాట్లాడుటం కూడా లేదు. అంతలా పరిస్థితులు మారిపోయాయి.


 అయితే ఇటీవల కాలంలో మద్యం తాగుతున్న సమయంలో ఇక మంచి స్టఫ్ పక్కనే ఉండే విధంగా ప్రతి ఒక్కరు చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏ మద్యం షాపు దగ్గరికి వెళ్లిన పక్కనే ఏకంగా నూనెలో వేయించిన చికెన్, మటన్, ఫిష్ అంటూ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. దీంతో ఇక ఇలాంటి స్టఫ్ నే తీసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి. కానీ ఇలాంటి స్టఫ్ ను ఇష్టపడే మందుబాబులందరికీ కూడా ఊహించని షాక్ ఇచ్చే విధంగా ఇప్పుడు సర్వేలో వెలుగులోకి వచ్చిన ఒక నివేదిక ఉంది. ఈ విషయం తెలిసి ప్రస్తుతం అందుబాటులో అందరూ కూడా షాక్ అవుతున్నారు.



 ఇంతకీ అదేంటంటే.. మద్యం తాగడం వల్ల ఏకంగా లిక్కర్ ఎలర్జీ వస్తున్నట్లు దేశంలోనే తొలిసారి హైదరాబాద్లో గుర్తించారు. ఒంటిపై ఎర్రటి దద్దుర్లు వస్తున్నాయట. ఆగ్రా నుంచి వచ్చిన జాన్ అనే 36 ఏళ్ల వ్యక్తికి ఈ వ్యాధి ఉన్నట్లు వైద్యులు తేల్చారు. అయితే మద్యం తాగేటప్పుడు  స్టఫ్ గా నూనెలో వేయించిన చికెన్, మటన్, రోస్ట్, పల్లీలు,  బఠానీలు వంటివి హై హిస్టమిన్ ఫుడ్ వల్ల ఈ భయంకరమైన ఎలర్జీ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అశ్రద్ధ చేస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ విషయం తెలిసి మందుబాబులందరూ కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: