మన శరీరానికి తగినన్ని విటమిన్స్, మినరల్స్ ను అందించినప్పుడే మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది.అప్పుడే మనం ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము.అయితే చాలా మంది కూడా విటమిన్ ఎ, బి, సి, డి, ఐరన్, క్యాల్షియం ఇంకా పొటాషియం వంటి పోషకాలు మన శరీరానికి అందితే సరిపోతుందని అనుకుంటారు. కానీ మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాల్లో మెగ్నీషియం కడా ఒకటి. మన శరీరానికి అవసరమయ్యే మినరల్స్ లో ఖచ్చితంగా ఇది ఒకటి. కండరాలు ఇంకా నరాల పనితీరును మెరుగుపరచడంతో పాటు చాలా రకాల జీవక్రియల నిర్వహణలో కూడా మెగ్నీషియం మనకు సహాయపడుతుంది. విటమిన్ డి వంటి పోషకాలను శరీరం ఉపయోగించుకునేలా చేయడంలో ఇంకా రక్తనాళాల్లో రక్తప్రవహాన్ని నియంత్రించడంలో మెగ్నీషియం చాలా సహాయపడుతుంది.ఇతర పోషకాల లాగే మెగ్నీషియం కూడా మన శరీరానికి ఎంతో అవసరం. శరీరంలో మెగ్నీషియం లోపించడం వల్ల మనం చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదర్కోవాల్సి వస్తుంది. అయితే కొన్ని రకాల లక్షణాలను బట్టి మన శరీరంలో మెగ్నీషియం లోపించిందని ఈజీగా గుర్తించవచ్చు. శరీరంలో మెగ్నీషియం లోపించడం వల్ల అలసట ఇంకా నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోజంతా కూడా ఉత్సాహంగా పని చేసుకోలేకపోతారు.


అలాగే శరీరం బలహీనపడినట్టుగా ఉంటుంది.ఇంకా అదే విధంగా ఆకలి కూడా తగ్గిపోతుంది. ఇంకా కండరాలు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. అలాగే మెగ్నీషియం లోపం కండరాల నొప్పులకు కూడా దారి తీస్తుంది. ఇంకా అలాగే శరీరంలో మెగ్నీషియం లోపించడం వల్ల గుండె సాధారణం కంటే ఎక్కువగా కొట్టుకున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇంకా అదే విధంగా తరచూ వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఇక ఈ లక్షణాలను బట్టి మన శరీరంలో మెగ్నీషియం లోపించిందని ఖచ్చితంగా గుర్తించాలి. మెగ్నీషియం లోపాన్ని మనం చాలా ఈజీగా అధిగమించవచ్చు.ఇందుకోసం మనం మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి.గోధుమలు, పాలకూర,తోటకూర, రాగులు, సజ్జలు, పెసర్లు, అరటి పండు, డార్క్ చాక్లెట్, పొద్దు తిరుగుడు గింజలు ఇంకా రాజ్మా వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత మెగ్నీషియం లభిస్తుంది.అందువల్ల మనం మెగ్నీషియం లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము.

మరింత సమాచారం తెలుసుకోండి: