ఫిబ్రవరి 13వ తేదీన ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు...ఎంతో  మంది ప్రముఖుల జననాలు..ఇంకెంతో మంది  మరణాలు జరిగాయి.  మరి ఒకసారి హిస్టరీ లోకి వెళ్లి చూస్తే ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 న్యూఢిల్లీ : భారత దేశ రాజధాని గా న్యూఢిల్లీ 1931 ఫిబ్రవరి 13వ తేదీన నిర్మించబడింది. ఇక ఇప్పటికీ న్యూఢిల్లీ భారత దేశ రాజధానిగా కొనసాగుతుంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచే ప్రస్తుతం పరిపాలన సాగిస్తోంది. 

 

 సరోజినీ నాయుడు జననం : స్వతంత్ర సమరయోధురాలు కవయిత్రి అయిన సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13వ తేదీన జన్మించారు. సరోజిని నాయుడు 1925 సంవత్సరంలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు కి తొలి మహిళా అధ్యక్షురాలిగా కూడా కొనసాగారు. అంతేకాకుండా భారతదేశపు తొలి గవర్నర్ గా కూడా ఆమె రికార్డు సృష్టించారు. దేశం బానిసత్వం నుంచి విముక్తి  పొందాక భారత మహిళలు ఏ రంగంలోనూ తీసిపోరని నిరూపించిన వీర మహిళల్లో ఒకరు సరోజిని నాయుడు. సరోజినీ నాయుడు మంచి రచయిత్రి కూడా. అయితే సరోజినీ నాయుడు తండ్రి అఘోరనాథ్ సుప్రసిద్ధ పండితుడు ఈయన  ఎనిమిది భాషలలో... కవితలు రాసేవారు. భారతదేశ చరిత్రలో గొప్ప స్వతంత్ర సమరయోధురాలు గానే కాకుండా... గొప్ప రాజకీయ నాయకురాలిగా కూడా సరోజినీ నాయుడు తెలుగు ప్రజల గుండెల్లో నిలిచి పోయింది. అంతే కాకుండా భారత కోకిలగా కూడా సరోజినీ నాయుడు పేరుగాంచింది. 

 

 గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి జననం : సుప్రసిద్ధ పండితులైన ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి 1880 ఫిబ్రవరి 13వ తేదీన జన్మించారు. జొన్నలగడ్డ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంస్కృతం అభ్యసించారు. ఈయన ఎన్నో స్తోత్రాలను కూడా రచించారు. సమస్త దేవతా రూపంలోని లోకేశ్వరుడి పై స్త్రోస్త్రాలు రచించారు  గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి. కేనోపనిషత్తు కఠోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు మండకోపనిషత్తు  మొదలైన గ్రంథాలను రచించారు గట్టి లక్ష్మీ నరసింహ శాస్త్రి. 

 

 మాదాల నారాయణస్వామి జననం  : సీనియర్ కమ్యూనిస్టు నాయకుడైన మాదాల నారాయణస్వామి 1914 ఫిబ్రవరి 13వ తేదీన జన్మించారు. ఎంఎన్ఎస్  గా ప్రసిద్ధి గాంచాడు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామంలో జన్మించిన మాదాల నారాయణస్వామి ఉత్తమ కమ్యూనిస్టుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మాదాల నారాయణస్వామి... భారత్-చైనా మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం తొలగించిన తర్వాత 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీ  అభ్యర్థిగా ఒంగోలు శాసన సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు మాదాల నారాయణస్వామి. 1962లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పలు పదవుల్లో  పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పని చేశారు మాదాల నారాయణస్వామి. రైతు కూలీల సమస్యలు... కార్మిక సంఘాల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించి వాటి సాధన కోసం పోరాడారు. 

 

 నూతి  శంకర్రావు జనం: ఆర్య సమాజ్ కు  చెందిన ప్రముఖ నాయకుల్లో ఒకరైన నూతి శంకరరావు 1930 ఫిబ్రవరి 13వ తేదీన మెదక్ జిల్లా టెక్నాల్ లో  జన్మించారు. నిజాం వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు నూతి శంకరరావు. పండిట్ నరేంద్రజీ,  వినాయకరావు విద్యాలంకార్ వంటి ప్రముఖుల ప్రసంగాలు వల్ల ప్రభావితులైన నూతి శంకరరావు ఆర్య సమాజ సమ్మేళన జరిపించాడు. ఇక 1948 మార్చి లో అరెస్టు కాబడిన నూతి శంకరరావు ఆ తర్వాత విమోచనోద్యమ అనంతరం  విడుదలయ్యారు. 1951లో రెవెన్యూ శాఖ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం నుండి  కలెక్టర్ గా కూడా పని చేశారు ఈయన. 

 

 నూనె శ్రీనివాసరావు జననం  : ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త అయిన నూనె శ్రీనివాసరావు 1972 ఫిబ్రవరి 13వ తేదీన ప్రకాశం జిల్లాలోని చీరాల లో జన్మించారు. సామాజిక సేవలో 16 సంవత్సరాలుగా వివిధ పథకాలతో ముద్నుకెళ్తున్నాడు  నూనె శ్రీనివాసరావు. 

 

 

 బాలు మహేంద్ర మరణం : దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు  మరియు దర్శకుడు అయిన బాలు మహేంద్ర 2014 ఫిబ్రవరి 13వ తేదీన మరణించారు. కళాత్మకమైన చిత్రాలను తీయడంలో ఎంతగానో ప్రసిద్ధికెక్కిన బాలు మహేంద్ర ఐదు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. మొదట కెమెరామాన్ గా తమిళ  చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన బాలుమహేంద్ర అనంతరం స్క్రీన్ప్లే-దర్శకత్వం నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టి తన  శైలిలో సత్తా చాటారు దక్షిణాదిలోని అన్ని భాషల చిత్రాలను రూపొందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: