ఏప్రిల్ 20వ తేదీన ఒకసారి చరిత్రలోకి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు ఎన్నో ముఖ్య సంఘటనలు జరిగాయి, మరి ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జననం : గుంటూరు ప్రాంతమును పరిపాలించిన కమ్మ రాజు అమరావతి సంస్థాన  అయిన వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు 1761 ఏప్రిల్ 20వ తేదీన జన్మించారు. 

 

 పి.శంకరరావు జననం  కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు మాజీ రాష్ట్ర మంత్రి అయిన  శంకరరావు 1948 ఏప్రిల్ 20వ తేదీన జన్మించారు, ఇప్పటివరకు ఏకంగా అయిదు సార్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు శంకరరావు. నాలుగు సార్లు షాద్నగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికకాగా,.. 2009లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి విజయఢంకా మోగించారు  శంకర్ రావు. వైద్య శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసిన అయినా స్థానికంగా మంచి డాక్టర్ గా పేరు పొందారు. ఆ తర్వాత రాజకీయాల్లో చేరాక వైద్య వృత్తి పూర్తిగా స్వస్తి పలికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మద్దతు ప్రకటించి ముందుకు నడిచాడు. విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమం కోసం ఎంతగానో పోరాడాడు.  తన ప్రసంగాలతో ఎప్పుడు ప్రతిపక్ష నాయకుల పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉండేవారు. 

 

 

నారా చంద్రబాబునాయుడు జననం  : టిడిపి అధినేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదమూడో ముఖ్యమంత్రి... నవ్యాంధ్రప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20వ తేదీన జన్మించారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 1994 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా తన గళాన్ని వినిపించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు... ఎన్నో పురస్కారాలు కూడా పొందారు. కేవలం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించారు చంద్రబాబు నాయుడు, చిన్నప్పుడు నుంచి ప్రజా సేవ పై ఆసక్తి కలిగి ఉన్న చంద్రబాబు నాయుడు తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించినప్పటికీ ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని నిర్థారించి రాజకీయాలపై దృష్టి పెట్టాడు, 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మొదటి సారి గెలుపొందారు చంద్రబాబు నాయుడు. 

 

 

 కొప్పుల ఈశ్వర్ జననం : ప్రముఖ తెలంగాణ రాజకీయ నాయకుడు అయిన  కొప్పుల ఈశ్వర్ 1959 ఏప్రిల్ 20వ తేదీన జన్మించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన కొప్పుల ఈశ్వర్ 2019 నుండి ఎస్సీ ఎస్టీ గిరిజన బీసీ మైనార్టీ వికలాంగుల వయోజనుల శాఖ మంత్రిగా పని చేశారు, 

 

 

 మమతా కులకర్ణి జననం  : భారతీయ చలన చిత్ర నటి బెంగాలీ హిందీ తమిళ తెలుగు కన్నడ మలయాళ చిత్రాల్లో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటి మమతా కులకర్ణి.నిజంగా బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది మమతా కులకర్ణి. 

 

 

 ఎమ్మెస్ రామారావు మరణం,, : మోపర్తి సీతారామా రావు ఆయన తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్యగాయకుడు 1992 ఏప్రిల్ 20వ తేదీన మరణించారు. ఆయనకు సుందరదాసు అనే బిరుదు కూడా ఉంది, మొదటి తరంలో ఎన్నో సినిమాలకు దర్శకుడిగా సంగీత దర్శకుడిగా ఎంతగానో తన ప్రసంగాలతో ఆకట్టుకున్నాడు, 

 

..

మరింత సమాచారం తెలుసుకోండి: