అదో మంచు ఖండం. మంచు తప్ప ఏది కనిపించని భూభాగం. అక్కడ ఎటు చూసినా మంచు మయమే, మానవ పాదం అడుగుపెట్టిన  చిట్టచివరి ఖండం  అదే. అక్కడ కాలం అవ్వడం కూడా పెద్ద సాహసమే. అలాంటిది వాహనాల సంగతి మాట్లాడడం  అనవసరం కూడా. కానీ ఓ కొత్త చరిత్రకి అడుగు పడింది. కారు కాదు బైక్ కాదు ఏకంగా విమానమే ల్యాండ్ అయింది. అవును అంటార్కిటికా భూభాగంపై ఎయిర్ బస్ ల్యాండ్ అయింది. ఇన్నాళ్లు అంటార్కిటికా కు నౌకలు మాత్రమే వెళ్లేవి. ఇక ఇప్పుడు విమానాలు కూడా వెళ్తాయేమో. ఎందుకంటే చరిత్రలో తొలిసారిగా కమర్షియల్ ఎయిర్ బస్ A340 అంటార్కిటికాలోని మంచి పై సేఫ్ గా దిగింది. అదేంటి మంచుపై విమానం ల్యాండ్ అవడం ఏంటి, అక్కడ రన్ వే లేదు కదా అనే డౌట్లు వస్తాయి.

 కానీ ఇది అక్షరాల నిజం. మొట్టమొదటిసారిగా ఎయిర్ బస్  A340 విమానం అంటార్కిటికా మంచుమీద ల్యాండ్ అయింది. హై ఫ్లై అనే ఎయిర్ ఏషియన్ కంపెనీ విమాన ఫీట్ సాధించింది. దక్షిణాఫ్రికాలోని కేఫ్ టౌన్ నుంచి నవంబర్ 2న ఈ విమానం బయలుదేరింది. మొత్తం 4506 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటలు  ప్రయాణించి అంటార్కిటికా లో ల్యాండ్ అయింది. ప్రయాణం లో పాల్గొన్న అందరికీ  హై -ఫ్లై ఎయిర్ ఏషియన్ కంపెనీ ఇన్సూరెన్స్ చేయించింది. విమానం బయలుదేరడం,ఎగరడం ఇవేమీ మ్యాటర్  కాదు. కానీ మంచి లో ల్యాండింగ్ ఎలా అయిందన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న పెద్ద డౌట్. మంచులో విమానం కూరుకుపోకుండా సేఫ్ గా ఎలా ల్యాండ్ అయిందన్నది  ఆసక్తికరమే. విమానం దిగే ప్రాంతాన్ని కొన్ని నెలలుగా ప్రిపేర్ చేస్తూ వచ్చారు. కంటిన్యూగా మంచు గట్టిగా ఉండేందుకు ఏవేవి చేయాలో అన్నీ చేశారు. అంటార్కిటికా లో రన్ వే లేకపోయినా ఈ విమానం కోసం 10వేల అడుగుల రన్ వే లాంటిది తయారు చేశారు. మొత్తానికి మంచి పై విమానాన్ని ల్యాండ్ చేస్తూ ఓ చారిత్రక ఘట్టానికి తెర తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: