రోజూ గుప్పెడు బాదం పప్పులను తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరం అనే సంగతి తెలిసిందే. బాదంను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మామూలుగా తినడం కంటే రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. నీటిలో నానబెట్టడం వల్ల అవి మరింత రుచికరంగానూ ఉంటాయి.  బాదం పప్పు ఎక్కువ సేపు నీటిలో నానబెట్టడం వల్ల ఈ తొక్క తేలిగ్గా వచ్చేస్తుంది. 


రోజూ బాదం పప్పు తినడం వల్ల వీటిలోని అసంతృప్త కొవ్వులు ఆకలిని తగ్గిస్తాయి. కడుపు నిండిన భావన రావడం వల్ల తేలిగ్గా బరువు తగ్గించుకోవచ్చు. నానబెట్టిన బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు విరివిగా లభిస్తాయి. వయసు మీద పడటం, వృద్ధాప్య ఛాయల నుంచి ఇది కాపాడుతుంది. ఇందులో విటమిన్ బి7, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్ తో పోరాడతాయి. పుట్టుకతోపాటు వచ్చే లోపాలను తగ్గిస్తాయి. 


 ప్రతిరోజు బాదం లను తినటం వల్ల శరీరంలో ఎక్కువ స్తాయి గల 'లిపోప్రొటీన్'లను పెంచి, తక్కువ స్థాయి గల 'లిపోప్రొటీన్'లను తగ్గిస్తాయి. బాదం ఎక్కువగా మోనో సాకరైడేటేడ్ ఫ్యాట్, ఆరోగ్యాన్ని పెంచే  ఫ్యాట్ ని కలిగి ఉంటాయి. ఒక రోజుకి 7 గ్రాముల బాదం తినటం వలన కొవ్వు స్థాయిలను 15 శాతం తగ్గిస్తాయి. బాదం ఎక్కువగా కాల్షియమ్, మేగ్నేషియం, ఫాస్ఫరస్'ను కలిగి ఉండటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. దంతాలు, ఎముకలు ఆరోగ్యంగా మరియు బలంగా ఉండటానికి ఈ పోషకాలు తప్పని సరిగా అవసరం. 


ఈ పోషకాల లోపం వల్ల ఒస్టియోఫోరోసిస్ అనే వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధికి యోగ్యమైన చికిత్స తీసుకోవటం వల్ల తగ్గిపోతుంది. బాదం విటమిన్ ‘E’ కలిగి ఉన్నందు వలన యాంటీ -ఆక్సిడెంట్'గా పనిచేసి సూర్యరశ్మి వల్ల చర్మ కణాలకు కలిగే హానిని ఆపుతుంది. బాదం పాలు ఎక్కువగా ప్రోటీన్, విటమిన్'లను కలిగి ఉండటం వలన చర్మ కణాలను హైడ్రేటింగ్ గాను మరియు మృదువుగా ఉంచుతుంది. బాదం ఎక్కువగా ఫోలిక్ యాసిడ్'ని కలిగి ఉన్నందున గర్బిణులకు ప్రసవ సమయంలో వచ్చే ఇబ్భందులను తగ్గిస్తుంది. బాదం కణాలు ఏర్పడటానికి, కణాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: