నేటి మనిషి ఎక్కువగా విలాస వస్తువుల వాడకంతో పెద్దగా శారీరక శ్రమ చేసే అవసరం లేకుండా చేసుకుని రకరకాల వ్యాధులకు మరియు రుగ్మతలకు గురి అవుతున్నాడు అనే చెప్పాలి. ఒకప్పటి కాలంలో ప్రతి ఇంట్లోని మెజారిటీ సభ్యులు ఏదో ఒక పని పాటలు చేసుకుని తమ జీవనాధారాన్ని కొనసాగించడంతో పాటు, ఆ పనుల ద్వారా శరీరక మరియు మానసిక ఉల్లాసాన్ని పొందేవారు. ఇక ఇటీవల రాను రాను ప్రతి ఒక్క పనికి సులువైన మార్గాలు రావడంతో, మనలో అనేకులు ఏ మాత్రం శ్రమ లేకుండా తమ శరీరాన్ని తామే నాశనం చేసుకుంటున్నారు. ఇక కల్తీ ఆహార పదార్ధాల వంటివి నేటి మానవుడికి గ్యాస్ ట్రబుల్, క్యాన్సర్, మైగ్రేన్ తలనొప్పి, మానసిక వేదనలు, చికాకుల వంటివి తెచ్చిపెడుతున్నాయి. అయితే ఎక్కువగా శరీరానికి పోషకాలు అంది, 

శరీరం ఎప్పుడూ ఉత్తేజితంగా ఉండడానికి రోజువారీ మనం తీసుకునే ఆహారపదార్ధాలకంటే ఎక్కువశాతం పండ్లను కనుక తీసుకుంటే మంచిదని ఎప్పటినుండో డాక్టర్లు చెప్తూనే వున్నారు. అయితే మనలో కొందరు అవి పాటించినప్పటికీ మరికొందరు మాత్రం పెద్దగా పాటించరు అనే చెప్పాలి. ముఖ్యంగా మన శరీరానికి పండ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్క పండులో ఇదొక సద్గుణం ఉండి, అది మన శరీరానికి ఎంతో మంచి చేస్తుంది. ఇక మనం తీసుకునే రోజువారీ పండ్లలో ఎక్కువగా అరటిపండుని కనుక తీసుకుంటే అన్నివిధాలా శరీరానికి మేలని అంటున్నారు వైద్యులు. ముందుగా ఏ మనిషికైనా ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత కాలకృత్యాలు తీర్చుకోవడం ప్రధమ దినచర్య. అయితే ఫ్రీగా మోషన్ కాకపోవడం, దానివలన చెడు పదార్ధాలు వంటివి మన పొట్టలో నిల్వ ఉండడం వలన ఎక్కువ శాతం రోగాలు రావడానికి ఆస్కారం కలుగుతోందని వారు అంటున్నారు. కాబట్టి అవకాశం ఉన్నంతవరకు నిత్యం ఉదయాన్నే పండిన అరటిపండుని కనుక తీసుకుంటే, 

ఫ్రీగా కడుపు కదలడంతో పాటు ప్రేగుల్లో ఉండే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వంటివి అది మెల్లగా తగ్గిస్తుందట. ఇక అరటి పండు ఇన్స్టెంట్ గా మనకి ఎనర్జీని ఇస్తుంది అనేది తెలిసిందే, అలానే దానితో పాటు ఈ అరటి మనకు మానసిక టెన్షన్ ని మరియు ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అయితే ఈ పండును షుగర్ వ్యాధి వచ్చిన వారు తప్పితే మిగతా వారందరూ కూడా అవకాశం ఉన్నంతవరకు నిత్యం తీసుకుంటూ ఉంటె, అన్నికంటే ముఖ్యమైన జీర్ణక్రియ సంబంధ వ్యాధులు దరిచేరకపోవడం, మరియు శరీరం ఎప్పుడూ తేలికగా ఉండడం వంటివి జరుగుతుందట. ఇక ఈ అరటి పండ్లలో ఎక్కువగా పసుపుగా ఉండే నాటు అరటిని కనుక తీసుకుంటే శరీరంలో వేడి కూడా మెల్లగా తగ్గుముఖం పడుతుందట. ఇక ఈ అరటి ద్వారా పురుషుల్లో లైంగిక సామర్ధ్యం మెల్లగా వృద్ధి చెంది, వీర్య కణాల్లో లోపాలు కూడా తగ్గుతాయని అంటున్నారు. సో, విన్నారుగా ఫ్రెండ్స్, మీరు కూడా అరటి పండుని నిత్యం తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని అమృతమయం చేసుకోండి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: