ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ తప్పని సరిగా ఉండే వస్తువు సైకిల్‌. అధిక మైలేజీలనిచ్చే బైక్ లు లేదా సుఖాలనిచ్చే కార్లు రావ‌డంతో సైకిల్స్ ప్ర‌భావం త‌గ్గిపోయింది. కేవలం చిన్న పిల్లలు తొక్కుకునేందుకు లేదా ఇంట్లో అలంకరణ వస్తువుగానే మిగిలిపోయింది. వాస్త‌వానికి బౌతిక వ్యాయామంలో సైకిత్ తొక్కడం, మరియు పరుగు రెండూ అద్భుతమైనవే. ఈ రెండు కూడా భౌతికంగా మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. సైకిల్ తొక్కటం వలన బరువు త్వరగా తగ్గవచ్చు. అది మీలోని కేలరీలు ఖర్చు చేసి, కొవ్వు నిల్వలు కరిగిస్తుంది. వేగంగా కనుక సైకిల్ తొక్కితే, అసలు మీరు బరువు పెరిగే ప్రసక్తి లేదు.

 

 సైకిల్ తొక్కితే శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు ఒత్తిడి కూడా తగ్గుతుంది. అడ్రినలిన్, ఎండార్ఫిన్స్‌ విడుదలై మానసిక ప్రశాంతత లభిస్తుంది. సైకిలు తొక్కితే అది మీ శారీరక కండరాలను బలపరచి మంచి శక్తి కలిగిస్తుంది. రోజూ సైకిల్ తొక్కడం బ్రెయిన్ పవర్‌ను పెంచుతుంది. రోజూ సైకిల్ తొక్కే పిల్లల్లో మెదడు చురుకవుతుంది. సైకిలింగ్ చేసేటపుడు మీరు అధికంగా గాలి తీసుకోవడం, వదలడం వంటివి చేస్తారు.గట్టిగా శ్వాస తీయడం, వదలడం మీలోని మలినాలను విసర్జిస్తుంది. వేగంగా సైకిల్ తొక్కితే అది మీ శ్వాసను పెంచి గుండెను ర‌క్షిస్తుంది.

 

సైకిల్‌ తొక్కడం వల్ల వంద శాతం ప్రయోజనాలే తప్ప ఎటువంటి అపకారం ఉండదు. కనీసం రోజుకు 20 నిమిషాలు సైకిల్‌ తొక్కడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయి. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ కొంత దూరం సైకిల్ తొక్కారంటే మీలోని డిప్రెషన్‌ను దూరం చేస్తుంది. అదేవిధంగా సైకిల్ తొక్క‌డం వ‌ల్ల కాళ్ళు, కీళ్ళు నొప్పులు, షుగర్‌ వ్యాధి గ్రస్తులకు, హృదయ కండరాలకు బలం చేకూరుతుంది. మ‌రియు అన్నీ రకాల క్యాన్సర్‌ల నివారణ, జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.


 


 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: