పుచ్చకాయ.. వేస‌వి వ‌చ్చిదంటే చాలు ఎక్క‌డ చూసినా ఇవే ద‌ర్శ‌నిమిస్తుంటాయి. ముఖ్యంగా మండుతున్న వేసవి నుంచి ఉపసమనం పొందడానికి చాలా మంది పుచ్చ‌కాయ తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. వేసవికాలంలో ఎండల్లో పుచ్చకాయ ముక్కలను తింటే ఆ అనుభూతే వేరు. పుచ్చకాయ ముక్కలను తినటం వలన వేసవిలో కలిగే దాహం బాగా తీరుతుంది. పండు నిండా వాటర్‌తో నిండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుచ్చ‌కాయ‌ను ఇష్టపడని వారుండరు. అవును! ఇందులో సహజంగా నీటి శాతం ఉంటుంది. 

 

అలాగే, ఇది పొటాషియం మరియు లైకోపీన్ వంటి శక్తివంతమైన పోషకాలు మరియు ఖనిజాలతో నిండి ఉంది. ఎండలో బయటకు వెళ్లినప్పుడు పుచ్చకాయ ముక్కలు తింటే వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. దీన్ని తినడం వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. ఇక పుచ్చకాయలో 92 శాతం నీటితో పాటుగా ఖనిజ లవణాలు, కార్బోహైడ్రేట్‌లు, విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉండటమే కాకుండా తక్కువ కాలరీలు ఉండటం వల్ల వేస‌విలో దీని భారీగా ఉంటుంది. అయితే సాధార‌ణంగా, మనలో చాలా మందికి భోజనాల మధ్య పండు తినే అలవాటు ఉంటుంది లేదా కొందరు పడుకునే ముందు వాటిని తినడానికి ఇష్టపడతారు. 

 

కానీ, రాత్రి పుచ్చకాయను తీసుకోవడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వ‌స్తాయ‌ట‌. వాస్త‌వానికి సాయంత్రం తర్వాత జీర్ణవ్యవస్థను నెమ్మదిగా ఉంచాలని, ఉదయం చాలా చురుకుగా ఉండాలని మరియు మీ డిన్నర్ తేలికగా మరియు తేలికగా ఉంచాలని ఎల్లప్పుడూ నిపుణులు చెబుతుంటారు. అయితే పుచ్చకాయలో అధిక నీరు మరియు ఆమ్లం ఉంటుంది. అందువల్ల ఇది మీ జీర్ణక్రియను క్లిష్టతరం చేస్తుంది మరియు కడుపు సమస్యలకు దారితీస్తుంది. ఈ క్ర‌మంలోనే ఒక్కోసారి కడుపు నొప్పికి కూడా దారితీస్తుంది. ఇక‌ కొన్ని సందర్భాల్లో, ఇది పేగు చికాకుకు దారితీస్తుంది. ఇది ఆయుర్వేద పుస్తకాలలో కూడా చేయబడింది.

 
 
 
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: