అయితే ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో.. ఖర్జూరం అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు పది ఖర్జూరాలు తినడం వల్ల.. ఇందులో ఉండే విటమిన్ సి, బీ 5, ఐరన్, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు ఇన్ఫెక్షన్లతో పోరాడే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. తద్వారా కరోనా వంటి భయంకర వైరస్‌కు చెక్ పెట్టవచ్చు. ఇమ్యూనిటీ పెంచడమే కాదు.. ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలు చేకూర్చడంలోనూ ఖర్జూరం అద్భుతం పని చేస్తుంది. ఖర్జూరంలో ఉండే డైటరీ ఫైబర్ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా ప్రతి రోజు ఎనిమిది నుంచి పది ఖర్జూరాలు తింటే సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే కర్జూరాల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సక్రోజ్ ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
అదే సమయంలో గుండె ఆరోగ్యానికి కూడా మెరుగుపరుస్తాయి. ప్రతిరోజు ఖర్జూరాలు తినడం వల్ల శరీంరలో ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. ఇది యాంటీ క్యాన్సర్ లక్షణాలను మరియు యాంటీ ఏజింగ్ సామర్థ్యంను అందిస్తుంది. ఖర్జూరంలో పొటాషియం పుష్కలంగా దొరుకుంది. ఇది బీపీని కంట్రోల్ చేస్తాయి. అందుకు క్రమం తప్పకుండా ప్రతి రోజు ఖర్జూరం తీసుకోమని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలోని రాళ్ళను కరిగించే శక్తి ఖర్జూరాలకు ఉంది. ఖర్జూరాలు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తాయి. కాబట్టి, మధుమేహం సమస్య ఉన్నవారు కూడా ఖర్జూరాలు తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ ఖర్జూరం గ్రేట్‌గా పనిచేస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి