పెసరపప్పును ఎక్కువగా పొంగల్ చేయడానికి. పెసరట్టు చేయడానికి ఉపయోగిస్తుంటాము. పెసరపప్పు వేడిని తగ్గిస్తుంది.పెసరపప్పు నలుపు, పసుపు రంగుల్లో ఎక్కువగా లభిస్తాయి.వీటిలో ఫైబర్, ప్రొటీన్లు,యాంటీ ఆక్సిడెంట్లు, న్యూట్రియన్స్, వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని,మొలకలు కట్టితీసుకోవడం వల్ల ఎక్కువ పోషకాలు అందుతాయి. పెసరపప్పును వాడటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..

 పెసర గింజలని ఉడికించి తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో ప్రోటీన్స్,మినరల్స్, విటమిన్స్ శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి.అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

 రక్త ప్రసరణ జరగడానికి పెసరపప్పు బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే కొన్ని పెసరపప్పు,టమాటా ముక్కలు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, చింతపండు,పసుపుఅన్నింటినీ కలిపి కొన్ని నీళ్లు పోసి బాగా ఉడికించాలి.ఈ మిశ్రమాన్ని తినడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.

 పెసరపప్పు లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల దృఢత్వానికి చాలా మంచిది.  పిల్లల ఎదుగుదల కూడా పెసర పప్పు చాలా మంచిది. ప్రతి రోజు ఏదో ఒక రూపంలో పెసరపప్పును తీసుకోవడం వల్ల యవ్వనంగా ఉంటారు

 వారంలో రెండుసార్లు పెసరపప్పుతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉంటుంది. పెసరపప్పు లో క్యాన్సర్ ను ఎదుర్కొనే గుణాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

 గుండె జబ్బు, రక్తపోటు,డయాబెటిస్,వంటి వ్యాధులు ఉన్న వాళ్లు,డైట్ లో కచ్చితంగా పెసరపప్పు చేర్చుకోవాలి.పెసర పప్పు తినడం వల్ల ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి.

 పెసరపప్పు తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తాయి. పెసరపప్పు లో ఉండే సోడియం శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.దానివల్ల యాక్టివ్గా ఉంటారు.

 పెసరపప్పు లో విటమిన్ బి,విటమిన్ సి,ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.ఇవి చర్మ ఆరోగ్యానికి ఉపయోగ పడతాయి. పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే సమస్యలను కూడా తొలగిస్తాయి..                                                                                                                                                 

మరింత సమాచారం తెలుసుకోండి: