బంగాళదుంపను పేస్ట్ చేసి అందులోకి నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసుకొని ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.నలుపు పోయి తెల్లగా మారుతుంది. ఈ విధంగా నెలకి మూడుసార్లు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.బంగాళదుంప లో బ్లీచింగ్ ఏజెంట్స్ అధికంగా ఉండటం వల్ల నలుపు దనాన్ని పోగొట్టి, తెల్లగా మారుస్తుంది.
ముఖానికి పాలు వాడడం వల్ల చర్మం తెల్లగా మారుతుంది. పాలన ఈ విధంగా వాడాలి. కాటన్ తీసుకుని పాలలో ముంచి ముఖానికి బాగా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల నలుపు తగ్గి, తెల్లగా మారుతుంది.
ముఖము నలుపు గా ఉన్న, మచ్చలు ఉన్న, కలబంద ని వాడడం వల్ల నలుపు తగ్గడమే కాకుండా మచ్చలు కూడా తగ్గుతాయి. ఈరోజు నిద్రపోయే ముందు కలబంధ మొక్క నుండి కట్ చేసి జెల్లును ముఖానికి, మెడకు బాగా అప్లై చేయాలి ఉదయం లేవగానే కడిగేసుకోవాలి.
కీరదోసకాయ రసం,తేనే కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి, మెడకు పట్టించాలి.ఇలా వారంలో ఒక రోజు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి పొడి కొట్టుకోవాలి. ఈ పొడి లోకి పాలు పోసి కొత్తగా పేస్టు మాధురి చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ముఖం,మెడనలుపు తగ్గి తెల్లగా మారతాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి