"ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు " అని అంటారు.. ఉల్లిపాయలు మన శరీరానికి కావలసిన ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. అందుకే మన పెద్దలు ఈ సామెతను వర్ణించారు. అయితే ఉల్లిపాయ తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


ప్రస్తుత కాలంలో చాలా మంది షుగర్ వ్యాధితో సతమత మవుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా 30 సంవత్సరాలు దాటగానే చాలా మందిని ఈ డయాబెటిస్ అటాక్ చేస్తోంది.. కాబట్టి ఉల్లిపాయ ద్వారా డయాబెటిస్  ను కంట్రోల్ చేయవచ్చు అని అంటున్నారు..అది ఏలాగో ఇప్పుడు చూద్దాం.. కేవలం రోజుకు 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయలు తీసుకుంటే చిటికెలో డయాబెటిస్ ను  కంట్రోల్ చేయవచ్చు అంటున్నారు నిపుణులు..


రోజుకు 50 గ్రాములు పచ్చి ఉల్లిపాయ మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అయితే ఉల్లిపాయను ఉదయం తిన్నా,సాయంత్రం తిన్నా,ఎలా తిన్నా సరే,  రోజు లో మాత్రం 50 గ్రాములు పచ్చి ఉల్లిపాయ ఉండేలాగా చూసుకోవాలి. 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ ల ఇన్సులిన్ తో సమానం. అయితే ఈ పచ్చి ఉల్లిపాయను రోజుకు 50 గ్రాముల చొప్పున ఏడు రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే ఫుల్ హై లో ఉన్న షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది..


అంతేకాకుండా ఉల్లిపాయలను తినడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కట్ చేసి, ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి,ఆ నీటిని వడగట్టి తాగితే మూత్రంలో మంట తగ్గిపోతుంది. అంతేకాకుండా నీళ్ల విరేచనాలు, వాంతులు అవుతున్న వారు ఉల్లిపాయను గుజ్జుగా దంచి, దానికి చిటికెడు ఉప్పు కలిపి తింటూ ఉంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది.  మహిళల్లో రుతుక్రమం సమయంలో వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా పురుషులలో వీర్య కణాల స్థాయిని కూడా పెంపొందిస్తుంది. అలాగే ఉల్లిపాయను తినడం వల్ల బీ పీ, గుండెపోటు, ఆస్తమా, అలర్జీ, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, నిద్రలేమి, స్తూలకాయం వంటి సమస్యలను అధిగమించడానికి పచ్చి ఉల్లిపాయ తినడం మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి: