సాధారణంగా నీళ్లు ఎక్కవగా తాగాలని పెద్ద వాళ్ళు, ఆరోగ్య నిపుణులు చెబుతూంటారు.‌ అయితే మనం ఆహారాన్ని ఎలాగైతే సరిపడా తీసుకుంటామో… అలాగే నీటిని కూడా మ‌న‌ శరీరానికి అవ‌స‌రం ఉన్నంత వరకే తాగాలి తప్ప ఎక్కువగా తాగకూడదు. అలా ఎక్కువగా నీటిని తాగితే మ‌న ఆరోగ్యానికి స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని సైంటిస్టులు తెలియచేస్తున్నారు. దాహంగా అనిపించినప్పుడు మాత్రమే నీటిని తీసుకోవాలి త‌ప్ప అదేపనిగా నీటిని తాగ‌రాద‌ని పరిశోధకులు చెబుతున్నారు.

అయితే సాధారణంగా ప్రతిరోజు 3, 4 లీటర్ల నీళ్లు తాగాలని అందరు చెపుతుంటారు. కానీ.. అంద‌రికీ ఆ సూత్రం పనిచేయదని, బాగా దాహం అయ్యేవారు మాత్ర‌మే ఆ నీటిని తాగాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇత‌రులు క‌చ్చితంగా 8 గ్లాసుల నీటిని రోజుకు తాగాల్సిన నియమం ఏమి లేదన్నారు. అంతేకాదు.. త‌మ‌కు కావలిసినంత నీటిని మాత్రమే తాగ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు. ఇక మ‌న‌కు నీరు ఎంత కావాలో నిర్ణ‌యించుకునే వ్య‌వ‌స్థ కూడా మ‌న శ‌రీరంలో ఉంటుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇక ఆ వ్య‌వ‌స్థ మ‌నం నీటిని ఎక్కువ‌గా తీసుకోకుండా చూస్తుంద‌ట‌. నీటిని అవసరానికి మించి తాగితే హైపోనెట్రేమియా అనే స‌మ‌స్య మొదలవుతుందని అన్నారు. దీంతో శ‌రీరంలో ఉండే ద్ర‌వాలు పలుచగా మారి, సోడియం స్థాయి తగ్గిపోతుందన్నారు. అలాగే శ‌రీరంలో ఉండే క‌ణ‌జాలం నశించిపోతాయన్నారు. అంతేకాదు..  క‌ణాలు వాపున‌కు గురవుతాయని సైంటిస్టులు తెలియచేస్తున్నారు.

అయితే ఇలాంటి ప‌రిస్థితుల్లో కొంద‌రు స్పృహ త‌ప్పిపడిపోవడం కూడా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ ప‌రిస్థితి విష‌మిస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని సైంటిస్టులు వివరిస్తున్నారు. కాబట్టి మీరు కూడా అవసరానికి మించి నీటిని తీసుకోకండి. శరీరానికి నీటి అవసరం ఉన్నప్పుడు ఆ సిగ్నల్స్ దాహం రూపంలో మనకు అందుతాయి. కాబట్టి దాహం వేసిన‌ప్పుడు మాత్రమే నీటిని తాగండి. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: