అలాగే జొన్న రొట్టెలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.ఒక్క ప్రోటీన్ మాత్రమే కాకుండా ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్ ఉండడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.జొన్న రొట్టెలు తినడం వలన జీవక్రియ రేటు పెరిగి మలబద్దకాన్ని దూరం చేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.మరి ఇన్నీ ఉపయోగాలు ఉన్న జొన్నరొట్టెను ఎలా తయారుచేయాలో కూడా మీకోసం ఇండియా హెరాల్డ్ వారు వివరించబోతున్నారు. జొన్న రొట్టెలు చెయడం చాలా సులభం.
వీటికోసం రెండు కప్పుల జొన్న పిండి, సరిపడా నీళ్లు, కొద్దిగా ఉప్పు ఉంటే చాలు.ముందుగా జొన్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటే గట్టిగా ముద్దలాగా చేసుకోవాలి. కొంచెం సేపు నానిన తరువాత వాటిని చిన్న చిన్న బాల్స్‌గా చేసుకోవాలి. ఆ బాల్స్‌ను కాటన్ క్లాత్‌పై పెట్టి, రోటీ మాదిరిగా పలుచగా అయ్యేలా చేత్తో మాత్రమే నొక్కాలి. ఆ తర్వాత స్టవ్‌ను వెలిగించి పెనం పెట్టి కాల్చుకోవాలి.అంతే జొన్న రొట్టెలు తయారు అయినట్లే. వొత్తివి కాకుండా ఏదన్నా కూర నంచుకుని తింటే జొన్న రొట్టెలు చాలా బాగుంటాయి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి