ఇక కొన్నిసార్లు పెళ్లి చేసుకోవడం అనేది చాలా ఆలస్యం అవుతుంది.ఇక మహిళలకైతే వయస్సు అనేది ఎక్కువగా ఉంటే, ఖచ్చితంగా మీ అండాశయాలను చెక్ చేసుకోవాలి..ఎందుకంటే వయస్సు కారణంగా, అమ్మాయిలలో గుడ్ల ఉత్పత్తి అనేది తగ్గుతుంది ఇంకా పిల్లలు పుట్టడంలో కూడా సమస్య ఉండవచ్చు.ఈ సమస్య తల్లి అయ్యే మీ సామర్థ్యాన్ని కూడా తెలియజేస్తుంది. అందువల్ల, మీరు లేటుగా వివాహం చేసుకుంటే, ఖచ్చితంగా పరీక్ష చేయించుకోవాలి.

ఇక పురుషుల విషయానికి వస్తే వారిలో స్పెర్మ్ స్థితి ఏంటి, స్పెర్మ్ కౌంట్ ఎంత? అనే దానికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వంధ్యత్వ పరీక్ష చేయించుకోవాలి.మగవారి శరీరం వంధ్యత్వానికి సంబంధించిన నిర్దిష్ట లక్షణాలను చూపించదు కాబట్టి ఇక భవిష్యత్తులో కుటుంబాన్ని ప్లాన్ చేయడంలో అలాగే ఇక గర్భం దాల్చడంలో ఎలాంటి సమస్యలు అనేవి తలెత్తకుండా ఈ పరీక్షలు చేయించుకోవడం అనేది చాలా అవసరం.

ఇక పెళ్ళికి ముందు ఇంకా భాగస్వాములు ఇద్దరూ కూడా తప్పనిసరిగా జన్యు పరీక్షని చేయించుకోవడం చాలా మంచిది. ఇక ఈ పరీక్షను పూర్తి చేయడం ద్వారా వల్ల మీ భవిష్యత్తు భాగస్వామికి ఎలాంటి జన్యుపరమైన జబ్బు లేదనే విషయం తెలుస్తుంది. ఆ పరీక్షలో కనుక ఏదైనా జబ్బుని గనుక మీరు గుర్తించినట్లయితే, దానిని సరైన కాలంలో చికిత్స చేయవచ్చు.ఇక కొందిరిలో అయితే జన్యుపరంగా వచ్చే జబ్బులు కూడా ఉంటాయి.

ఇక భార్యాభర్తల బ్లడ్ గ్రూప్ అనేది ఒకదానితో ఒకటి సరిపోకపోతే భార్యకు గర్భధారణ సమయంలో అనేక సమస్యలు అనేవి తలెత్తుతాయి. ఇక అందువల్ల, భాగస్వాములు ఇద్దరూ కూడా ఒకే Rh కారకాన్ని కలిగి ఉండటం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. కాబట్టి పెళ్లికి ముందే మీరు రక్త పరీక్షను చేయించుకోవటం అనేది మంచింది.

ఇక పై పరీక్షల్లో అన్నీ కూడా చేయించుకోపోయిన చేయించుకున్న కాని ఖచ్చితంగా HIV, అంధత్వం ఇంకా వయసు పరీక్ష చేయించోవటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మీ నూరేళ్ల జీవితాన్ని పంచుకోబోయే వ్యక్తికి ఇలాంటి పైకి కనిపించని జబ్బులు అనేవి ఉంటే మీతో పాటు మీకు పుట్టబోయే పిల్లలు కూడా చాలా బాధడాల్సిఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: