పెద్ద వాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు. ఒక ధనవంతుడు కన్నా ఆరోగ్యవంతుడు బలమైన వాడు అని, నిజంగా ఈ మాటలో వాస్తవం ఉంది. మనకు ఎంత డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యంగా లేకపోతే ఉపయోగం ఏమి ఉంటుంది. అందుకే మన జీవితంలో చాలా ముఖ్యమైంది ఆరోగ్యం. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడం తగదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వర్షాల బెడద ఎక్కువగా ఉంది. మామూలుగా వర్ష కాలం వచ్చిందంటే వివిధ రకాల సీజనల్ వ్యాధులు, జ్వరాలు రావడం పరిపాటి. కానీ అన్ని సందర్భాలలో ఓకె విధంగా ఉండదు. కొన్ని సార్లు సాధారణ జ్వరాలు విస జ్వరలుగా మారి ప్రమాదంగా పరిణమిస్తాయి. రోజు రోజుకీ పరిస్థితుల్లో మారుతుంటాయి. ముఖ్యంగా ఈ వర్షా కాలంలో చలి చాలా అధికంగా ఉంటుంది. ఈ చలిని తట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు.

అయితే చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అలా కానట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందు కోసం కొన్న జాగ్రత్తలు ఇప్పుడ చూద్దాం.

మీ ఇంట్లో ఉన్న పిల్లలను తపప్ని సరిగా దోమ తెరలు లోపలే పడుకోబెట్టడం మంచిది. తద్వారా దోమల బెడద నుండి వారిని రక్షించుకోవచ్చు.

* ఈ సమయంలో జలుబు దగ్గు చేయడం సహజం అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి. ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి. అతి సులభంగా ఈ జలుబు మరియు దగ్గు ఒకరి నుండి మరొకరికి సోకుతుంది.

* ఈ చలి వాతావరణానికి వచ్చే జ్వరాలు డెంగ్యూ కి దారి తీయవచ్చు. కాబట్టి లక్షణాలు ఒకటి రెండు రోజుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే డాక్టర్ ను తప్పక సంప్రదించండి.

* మీ ఇంట్లో అందరూ కూడా గోరు వెచ్చని నీటిని మాత్రమే తాగండి. మీరు ధరించే బట్టలు మీకు వేడి కలిగించేవిగా ఉండాలి.

* అంతే కాకుండా మీరు తీసుకునే ఆహారం వేడిగా ఉండాలి. గ్లూకోజ్ ను సైతం రోజులో ఎక్కువగా తాగుతూ ఉండడం మంచిది.

ఇవన్నీ చెప్పడానికి కారణం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విషజ్వరాలు బారి నుండి కాపాడడానికి.

ఈ కాలంలో బయట చేసే ఆహార పదార్థాలను తినడం మంచిది కాదు. కోరి కోరి వ్యాధులను కొనుక్కున్నట్లే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: