వ్యాక్సిన్ వేసుకోకుంటే రేషన్, పెన్షన్ కట్ చేయాలని తెలంగాణ వైద్య శాఖ నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి అమలు చేసే యోచనలో  ఉంది. ఈ మేరకు ప్రభుత్వానికి తెలంగాణ వైద్య శాఖ ప్రతిపాదన చేసింది. బ్రిటన్ మరియు ఇతర దేశాల్లో పెద్ద ఎత్తున కేసులు పెరుగుతున్నాయి. మనదేశానికి వచ్చేసరికి మొన్ననే 100 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయిందని సంబరాలు జరుపుకున్నాం కానీ ఇంకా చాలామంది వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంది. తెలంగాణలో ఇప్పటికైతే మూడు కోట్ల డోసులు మాత్రమే వ్యాక్సిన్ వేశారు.

ఇంకా వ్యాక్సిన్ వేసుకొని  అర్హులకు వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది కానీ చాలామంది వ్యాక్సిన్ వేసుకోవడానికి రావట్లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. వ్యాక్సిన్ వేసుకుని వారికి రేషన్ కట్ చేయాలి అని చూస్తున్నారు. తెలంగాణలో 92 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇవాలో,రేపో ఈ నిర్ణయం తీసుకొనుంది . మరోవైపు పెన్షన్ తీసుకునే వృద్ధులు కావచ్చు, వికలాంగుల కావచ్చు దాదాపు తెలంగాణలో ముప్పై ఏడున్నర లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారు. పెన్షన్ దారులకు కూడా వ్యాక్సిన్ తప్పనిసరి  అనే విధానాన్ని పెట్టబోతున్నారు. సెకండ్ డోస్ తీసుకొని వారు మరియు మొత్తానికి వ్యాక్సిన్ తీసుకొని వారిని కూడా గుర్తించడం జరిగింది. తెలంగాణలో 67 లక్షల మంది ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న పరిస్థితి ఉంది. 36 లక్షల మంది సెకండ్ డోస్ తీసుకోవడానికి వెనకాడుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఒకవేళ మళ్లీ థర్డ్ వేవ్ కనుక మొదలైతే వ్యాక్సిన్ తీసుకోని వారి పైన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఈ విధమైన కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళని గుర్తించి ఇతర శాఖల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైద్య శాఖ అని ప్రపోజల్స్  పెట్టింది. ప్రభుత్వం త్వరలోనే దీనికి సానుకూల ప్రకటన చేస్తుందని వైద్య శాఖ నుంచి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: