ఇక నల్ల మిరియాలు అనేక రకాల వంటలలో ఉపయోగిస్తారు. ఇది ఆహారం రుచిని బాగా పెంచుతుంది. అలాగే ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తుంది.అనేక వ్యాధుల చికిత్సకి దీన్ని ఉపయోగిస్తారు. ఇందులో పోషకాలు చాలా మెండుగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, కె, సి, కాల్షియం, పొటాషియం ఇంకా సోడియం మొదలైనవి ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, బరువు తగ్గించడానికి, కాలానుగుణ అలెర్జీలు ఇంకా ఆస్తమాతో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే దీనిని అనేక విధాలుగా కూడా ప్రయత్నించవచ్చు.ఇక మీరు పండ్లతో తయారు చేసిన ఆరోగ్యకరమైన పానీయాలకు మిరియాలని కలుపుకోవచ్చు. ఇది పానీయం రుచిని రెట్టింపు చేయడమే కాదు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది చర్మంపై మెరుపు తెచ్చేందుకు కూడా బాగా పనిచేస్తుంది.ఇక మీరు బరువు తగ్గాలనుకుంటే నల్ల మిరియాలతో చేసిన టీని తాగవచ్చు.



దీన్ని తయారు చేయడం చాలా సులభం. దీని కోసం మీకు 1/4 స్పూన్ నల్ల మిరియాలు, అల్లం, 1 తేనె, 1 కప్పు నీరు ఇంకా అలాగే నిమ్మకాయ అవసరం.ఇక మీరు ప్రతిరోజూ ఉదయం పూట రెండు నుంచి 3 నల్ల మిరియాలు తినవచ్చు. మీరు దాని ఘాటు లేదా వేడిని ఇష్టపడితే టీలో వేసుకొని కూడా తాగవచ్చు.అలాగే మీరు మార్కెట్ నుంచి 100% స్వచ్ఛమైన నల్ల మిరియాలు నూనెను కూడా పొందవచ్చు. ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఈ నూనె చుక్కని వేయండి. తరువాత దానిని తాగండి. ఇది బరువు తగ్గడంలో మీకు చాలా బాగా సహాయపడుతుంది.అలాగే నల్ల మిరియాలలో పైపెరిన్ అనేది ఉంటుంది. ఇది కొవ్వు కణాలు ఏర్పడకుండా బాగా నిరోధిస్తుంది. ఇంకా ఇది చాలా తక్కువ మొత్తంలో కేలరీలను కలిగి ఉంటుంది. ఇది బరువు పెరగనివ్వదు. ఇది జీవక్రియ రేటును కూడా వేగవంతం చేస్తుంది. అందువల్ల బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో ప్రొటీన్ కూడా ఉంటుంది.అందుకే తిన్న వెంటనే ఆకలి ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: