ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న వయసులోనే ప్రతి ఒక్కరికి బీపీ రావడం జరుగుతోంది అందుచేతనే ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరు బీపీ ఒకసారి చెక్ చేయించుకోవడం చాలా మంచిది.130/90 కంటే రక్తపోటు అధికంగా ఉన్నట్లు అయితే వైద్యుల సలహా తీసుకోవడం చాలా మంచిది. ఒకవేళ బీపీ ఉన్నట్లు అయితే మన జీవన శైలిలో పలు మార్పులను కచ్చితంగా చేసుకోవాలి.
1). ముఖ్యంగా ఉదయం పూట లేవగానే నడవడం వ్యాయామం చేయడం వంటివి చేయాలి ఇలా చేయడం వల్ల మానసిక ఆందోళన పడకుండా ఉంటారు.
2). ఉదయం లేవగానే ఒక పది నిమిషాల పాటు ధ్యానం చేసి మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇక అంతే కాకుండా ఆహారంలో పలు మార్పులు చేసుకుంటూ ఎప్పటికప్పుడు బీపీని చెక్ చేసుకుంటూ రక్తనాళాలు కొవ్వు స్థాయిని పెరగకుండా చూసుకోవాలి.
బీపీ ఉన్నవారు ఉప్పును తగ్గించడం మంచిది చక్కర వినియోగాన్ని కూడా తగ్గించాలి అలాగే మద్యం సిగరెట్టు అలవాటు ఉన్నవారు వాటిని ఎంత తగ్గిస్తే అంత మేలు.
1).పండ్లు పచ్చికాయ కూరలు గింజ ధాన్యాలను తింటూ ఉండాలి.
2). తేనే గోరువెచ్చని నీటిని ప్రతిరోజు తాగడం చాలా మంచిది
3). సూర్య రష్మీ, బయట గాలికి ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి.
4). ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి.