ఢిల్లీలో కారు బాంబు బ్లాస్ట్ ఒక్కసారిగా ప్రజలను ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ బ్లాస్ట్ వెనుక ఉగ్రవాది ఉమర్ నబీ మహమ్మద్ హస్తం ఉన్నట్లుగా గుర్తించారు. సోమవారం రోజున ఎర్రకోట వద్ద జరిగిన బాంబు బ్లాస్టులో ఉపయోగించిన కారు హుందాయి i -20 కారు. ఈ కారులో పేలుడు పదార్థాలు నింపి ఆత్మహుతి దానికి పాల్పడినట్లుగా అధికారులు తెలియజేశారు. అయితే ఈ దాడిలో సుమారుగా 12 మంది పైగా మరణించాక 20 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఈ ఉగ్రవాదికి ఇప్పుడు మరొక కారు ఉన్నట్టుగా వినిపిస్తోంది.


ఉమర్ నబీ మహమ్మద్ రెండవ కారు కోసం ఢిల్లీ, హర్యానా, యూపీ వంటి ప్రాంతాలలో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణలో ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్స్ కారు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ మహమ్మద్ పేరుపైన రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నట్లుగా తెలియజేశారు. కారు నెంబర్ DL10CK0458 అని తెలియజేస్తున్నారు. ఈ కారు నెంబర్ ఎక్కడ కనిపించినా కూడా వెంటనే తెలియజేయాలంటు అన్ని ఏజెన్సీలు అధికారులకు, పోలీసులు సైతం ఆదేశాలను జారీ చేశారు. పెట్రోల్ బంకులలో కూడా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సిసి ఫుటేజ్ లో ఈ కారు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలను జారీ చేశారు. ఆ కారులో ఏముంది అనే విషయం తెలియదు కానీ అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.


 ఢిల్లీ బ్లాస్ట్ వెనుక ముగ్గురు వైద్యులను అరెస్టు చేశారు. అయితే నలుగురు ఉగ్రవాదులతో కలిసి పెద్ద ప్లాన్ చేశారని, తన తోటి వైద్యులను అరెస్టు చేసిన తర్వాత తనని కూడా రెస్ట్ చేస్తారని ఉమర్ భయంతోనే ఈ దాడి చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఫరీదాబాద్ ఘటనలో అరెస్టు అయిన ముగ్గురు వైద్యుల వద్ద నుంచి అమ్మోనియం నైట్రేట్ సరఫరాతో బాంబు దాడికి ప్లాన్ చేశారని.. ఈ నలుగురికి కూడా ఉగ్రవాద నెట్వర్క్ లో భాగమై ఉండవచ్చని దర్యాప్తులో తేలిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: