నిద్రలేమి వల్ల పలు మానసిక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని, ఫలితంగా తరచుగా జలుబు, ఇతర శారీరక సమస్యలతో బాధపడతారట. ఇక తక్కువగా నిద్రపోవడం వల్ల మెదడు పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందట.6 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోతే మానసిక స్థితి క్రమంగా క్షీణించడం ప్రారంభమవుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతారు. కొన్నిసార్లు ఈ ఒత్తిడి బాగా పెరిగిపోయి డిప్రెషన్‌లోకి వెళ్లే ప్రమాదం ఉంది. నిద్ర లేమికి, డిప్రెషన్ కు చాలా సంబంధం ఉంది. డిప్రెషన్ ఉంటే నిద్ర రాదు, నిద్ర పట్టకపోతే డిప్రెషన్ వస్తుంది. కాబట్టి రోజులో కనీసం 6 గంటలైనా ప్రశాంతంగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.నిద్రలేమి మెదడు పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతంది. ఏకాగ్రత సామర్థ్యం దెబ్బతింటుంది. ఏ పనిపైనా శ్రద్ధ పెట్టలేరు. ఫలితంగా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా రోజుకు కనీసం 6 గంటలైనా నిద్రపోవాలి. ఇందుకోసం ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోవాలి. పోషకాలతో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.


కాఫీ, టీ, కూల్‌ డ్రింక్స్‌లకు దూరంగా ఉండాలి.పడుకునే ముందు ఫోన్లను దూరంగా పెట్టాలి.ఇలా నిద్రలేమి కారణాల రకరకాల వ్యాధులు వెంటాడుతుంటాయి. నిద్రతో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే వైద్యులు కూడా పదేపదే నిద్ర అవసరం అని చెబుతుంటాయి. చాలా మంది రాత్రుల్లో నిద్రపోకుండా స్మార్ట్‌ఫోన్‌లలో బీజీగా ఉంటారు. చాటింగ్స్‌, వీడియోలు చూడటం లాంటివి చేస్తుంటారు. దీని వల్ల నిద్రలేకపోవడమే కాకుండా రాత్రి సమయంలో స్క్రీన్‌ని ఎక్కువ సేపు చూస్తారు. అందువల్ల అన్ని జబ్బులు చాలా ఫ్రీగా వస్తాయి.6-7 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోయే అలవాటు ఉన్న వ్యక్తుల్లో జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. ఎక్కువగా ఆందోళన పడుతుంటారు. చాలా విషయాలను మర్చిపోతుంటారు. అందుకే నిద్రలేమి సమస్యలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. కావాలంటే ఇంట్లోనే యోగా చేయడం ద్వారా ఈ సమస్య నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: