మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలున్న ఆహారాలను తీసుకోవాలి. మన జీవనశైలి మన ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా గుండెజబ్బుల బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. బ్రిటన్‌లో గుండెజబ్బుల బారిన పడిన వ్యక్తుల చాలా మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా తాజా అధ్యయనం చేశారు. శాఖాహారులు గుండె సంబంధిత వ్యాధులతో చనిపోయే అవకాశం చాలా తక్కువని పరిశోధలో వెల్లడైంది.శాకాహారులు, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, మాంసం తినేవారు గుండె జబ్బుల బారిన పడే లేదా చనిపోయే ప్రమాదం ఎంతవరకు ఉందనే వివరాలను పరిశోధకులు విశ్లేషించారు.మాంసం ఎక్కువగా తినేవారిలో 94.7 శాతం మంది ఊబకాయం, గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. మాంసం ఎక్కువగా తినేవారితో పోలిస్తే చేపలను మాత్రమే ఆహారంలో భాగం చేసుకునేవారు హార్ట్ స్ట్రోక్, గుండె జబ్బులు, ఇతర గుండె సంబంధ అనారోగ్యాలకు గురయ్యే అవకాశం చాలా తక్కువని వారు చెబుతున్నారు. 


మాంసాహారం ఎక్కువగా తీసుకునేవారు పండ్లు, కూరగాయలు, ఫైబర్, మంచి కొవ్వులు, నీరు అధికంగా లభించే పదార్థాలకు దూరంగా ఉంటున్నారని గుర్తించారు.శాఖాహారులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నప్పటికీ, వీరు మాంసంకంటే హానికరమైన ఫాస్ట్‌ఫుడ్, స్మూతీ డ్రింక్స్, పిజ్జాలు.. వంటివి తింటున్నారని గుర్తించారు. కేవలం మాంసాహారం మానేసి, హానికరమైన ఇతర పదార్థాలను తీసుకుంటే అనారోగ్యాల ప్రభావం ఏమాత్రం తగ్గదని వారు చెబుతున్నారు. చేపలను మాత్రమే తినేవారు ఈ రెండు గ్రూపులతో పోలిస్తే ఆరోగ్యంగా ఉన్నారని గుర్తించారు. వీరు ఇంట్లో చేసుకున్న వంటలు తినడానికి ఆసక్తి చూపుతున్నారట.కాబట్టి చక్కగా నీట్ గా చేపలను తెచ్చుకొని వండుకొని తినండి. ఎలాంటి జబ్బుల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.ఈ చికెన్, మటన్ తినే బదులు చక్కగా చేపలు తినండి. ఇది ఎంతో రుచిగానే కాకుండా ఇంకా అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చేపలు తినండి. ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: