ఇప్పుడు టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు స్మార్ట్ ఫోన్‌లలో మునిగిపోతున్నారు. ఈ పెరుగుతున్న టెక్నాలజీ చాలా మందిని కూడా అసలు నిద్ర లేకుండా చేస్తోంది.రాత్రుల్లో కూడా గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ ఇంకా స్మార్ట్ మొబైళ్ల ముందు గడపడంతో నిద్రలేకుండా గడుపుతున్నారు. అందువల్ల చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. కానీ ఇలా రాత్రి ఎక్కువ సేపే మేలుకువతో ఉంటుండటం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా అలాగే చాలా మందికి ఆర్థికపరమైన టెన్షన్స్‌, ఇతర కారణాల వల్ల రాత్రుల్లు సరిగ్గా నిద్ర పట్టదు. రాత్రి సమయాల్లో నిద్ర లేకుండా గడిపే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.ఇలా రాత్రి నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్యంపై ఖచ్చితంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.రాత్రి చాలా త్వరగా నిద్ర రావాలంటే ఖచ్చితంగా కొన్ని చిట్కాలు పాటించాలి. ముఖ్యంగా స్క్రీన్‌లను ఎక్కువ సేపు చూడటం పూర్తిగా తగ్గించాలి. అంటే మొబైల్స్‌ కానీ, కంప్యూటర్‌ ఇంకా ల్యాప్‌లాప్‌ మరేదైనా కావచ్చు. రాత్రి సమయాల్లో వాటికి దూరంగా ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిది.


ఇంకా అలాగే రాత్రి నిద్రించే ముందు స్నానం చేయడం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. స్నానం చెయ్యడం వల్ల త్వరగా నిద్ర వస్తుంది. కానీ ఇలా రాత్రి సమయాల్లో అందరు స్నానం చేయకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భవతులు చెయ్యకూడదు.ఇక స్నానం చేయనివారు అయితే రాత్రి సమయాల్లో కాళ్లు కడుక్కోవాలి. ఆ తర్వాత కాళ్ళు కొంచెం చల్లగా ఉన్నప్పుడు కొబ్బరి నునే కొద్దిగా రాస్తే బాగా నిద్ర పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా అలాగే నిద్రించే గది ఖచ్చితంగా శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే శుభ్రత అనేది నిద్రపోయేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. రాత్రి పడుకునే సమయంలో వాడే దుస్తులు కూడా రోజు మారుస్తూ ఉండాలి. పడుకునే సమయానికి కనీసం రెండు గంటల ముందు మొబైళ్లను అస్సలు చూడవద్దు. వాటికి దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిది. ఇలాంటి విషయాలు పాటించినట్లయితే రాత్రి సమయాల్లో చాలా త్వరగా నిద్ర వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: