ఇప్పుడు చెప్పబోయే వంటకం తినడం వల్ల ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అలాగే వృద్దాప్య ఛాయలు త్వరగా మన దరి చేరకుండా ఉంటాయి. రోజుకు ఒక ఉసిరికాయను ఖచ్చితంగా తీసుకోవాలని మనకు వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. ఇక ఈ ఉసిరికాయలతో మనం ఆమల్ఆ మురబ్బాను తయారు చేసుకోవడం వల్ల సంవత్సరమంతా రోజుకు ఒక ఉసిరికాయను తినవచ్చు.ఈ ఆమ్లా మురబ్బా రుచిగా ఉండడంతో పాటు సంవత్సరమంతా కూడా నిల్వ ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఉసిరికాయలతో రుచిగా ఆమల్ఆ మురబ్బాను ఎలా తయారు చేసుకోవాలి ఇంకా అలాగే దీనిని ఎలా నిల్వ చేసుకోవాలి వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా ఉసిరికాయలను ఒక గిన్నెలోకి తీసుకోని తరువాత అవి మునిగే దాకా నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి.ఆ తరువాత వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ ఉసిరికాయలతో ఫోర్క్ తో లేదా చాకుతో చిన్న చిన్న రంధ్రాలని చేయాలి. ఆ తరువాత ఈ ఉసిరికాయలను అవిరి మీద 20 నిమిషాల పాటు మెత్తగా అయ్యే దాకా ఉడికించాలి. తరువాత వీటిని తీసి పూర్తిగా చల్లారే దాకా పక్కకు ఉంచాలి. తరువాత కండ చక్కెరను పలుకులుగా చేసుకుని జార్ లో వేసి మెత్తనిపొడిలా చేసుకోవాలి.


అయితే ఈ మురబ్బాను తయారు చేసుకోవడానికి  కేవలం స్టీల్ గిన్నెను లేదా నాన్ స్టిక్ కళాయిని మాత్రమే వాడాలి. ఆ తరువాత ఒక స్టీల్ గిన్నెలో మిక్సీ పట్టిన కండ చక్కెర పొడిని తీసుకోవాలి.తరువాత ఇందులోనే ఉడికించిన ఉసిరికాయలు, నీళ్లు పోసి కలుపుతూ వేడి చేయాలి. ఇక చక్కెర కరిగిన తరువాత మూత పెట్టి మధ్యస్థ మంటపై ఒక 7 నిమిషాల పాటు ఉడికించాలి.ఇక ఇలా ఉడికించిన తరువాత యాలకుల పొడి, సైందవ లవణం, శొంఠి పొడి ఇంకా మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత మళ్ళీ మూత పెట్టి చిన్న మంటపై మరో 15 నిమిషాల పాటు ఉడికించాలి.ఆ చక్కెర పాకం బంగారు వర్ణంలోకి రాగానే స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల బాగా రుచిగా ఉండే ఆమ్లా మురబ్బా తయారవుతుంది.దీనిని గాజు డబ్బాలో లేదా సిరామిక్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి. స్టీల్ పాత్రలో, అల్యూమినియం పాత్రలో మాత్రం అస్సలు వేయకూడదు.ఇక ఈ విధంగా తయారు చేయడం వల్ల ఆమ్లా మురబ్బా సంవత్సరం పాటు కూడా తాజాగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న ఉసిరికాయలను రోజుకు ఒకటి తినడం వల్ల రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: