మనలో చాలా మంది కూడా నిద్రలేమి నుండి బయటపడడానికి నిద్రమాత్రలను వాడుతూ ఉంటారు. అయితే నిద్రమాత్రలను వాడడం అంత మంచి పద్దతి కాదు. ఇలా నిద్రలేమితో బాధపడే వారు రాత్రి పడుకునే ముందు కొన్ని పండ్లను వారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల సహజ సిద్దంగా ఈ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు. ఇప్పుడు చెప్పే పండ్లను తీసుకోవడం వల్ల ఒత్తిడి ఈజీగా తగ్గి చక్కటి నిద్ర మన సొంతమవుతుంది.నిద్రలేమితో బాధపడే వారు రాత్రి పూట తీసుకోవాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ ఇ, పొటాషియం వంటి పోషకాలు కలిగిన వాటిల్లో బొప్పాయి కూడా ఒకటి. నిద్రించే ముందు దీనిని తీసుకోవడం వల్ల శరీరం నిద్రకు సిద్దమవుతుంది. అదే విధంగా ఆపిల్స్ ను తీసుకోవడం వల్ల కూడా మనం నిద్రలేమి నుండి బయటపడవచ్చు.కివీ పండ్లను తీసుకోవడం వల్ల కూడా మనం నిద్రలేమి నుండి బయటపడవచ్చు. వీటిలో విటమిన్ సితో పాటు సెరోటోనిన్ ఎక్కువగా ఉంటుంది.


 సాయంత్రం పూట వీటిని తీసుకోవడం వల్ల ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు. అలాగే విటమిన్ సి, సహజ చక్కెరలు ఎక్కువగా ఉండే వాటిల్లో నారింజ పండ్లు కూడా ఒకటి. వీటిని సాయంత్రం పూట తీసుకోవడం వల్ల మంచి నిద్ర మన సొంతమవుతుంది.రాత్రిపూట పైనాపిల్ ను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలతో పాటు మెలటోనిన్, విటమిన్ సి, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి నిద్ర చక్రాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.అలాగే నిద్రలేమితో బాధపడే వారు అరటి పండ్లను తీసుకోవాలి. దీనిలో మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కండరాలకు విశ్రాంతిని కలిగిస్తాయి. అలాగే అరటి పండ్లు ట్రిఫ్టోఫాన్ ను కలిగి ఉంటాయి. ఇది మెదడుకు విశ్రాంతిని కలిగించి నాణ్యమైన నిద్రను అందించడంలో సహాయపడతాయి. మెలటోనిన్ ఎక్కువగా ఉండే వాటిల్లో చెర్రీలు కూడా ఒకటి. చెర్రీలను తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యతతో పాటు నిద్రించే సమయం కూడా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: