సాధారణంగా పిల్లల యొక్క హైట్ వారి జీవన శైలి పైన,ఆహారపు అలవాట్ల పైన వంశపారం పైన ఆధారపడి ఉంటుంది.కొంతమంది ఇళ్లలో వంశపారంపర్యంగా హైట్ ఉన్నా సరే,సరైనా ఆహారపు అలవాటు లేక పిల్లలు పొట్టిగా ఉంటారు.అలాంటి పిల్లలకు ఎటువంటి ఆహారాలు ఇస్తే వారి పిల్లలు హైట్ పెరుగుతారో వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతూ ఉంటారు.అలా అని చెప్పి మార్కెట్లో దొరికే ప్రోటీన్ పౌడర్ని ఇస్తూ ఉంటారు.కానీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి.

సాధారణంగా మన శరీరపు హైట్ క్యాల్షియం, పొటాషియం,మెగ్నీషియం,ఫాస్పరస్ వంటి మినరల్స్ పైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.ఈ మినరల్స్ అధికంగా ఉన్న ఆహారాలు ఇవ్వడంతో పిల్లలు ఈజీగా పెరుగుతారు.అంతేకాక ఆరోగ్యంగా,యాక్టివ్ గా కూడా ఉంటారు.మరి ఆ కణజాలు కలిగిన ఆహార పదార్థాలతో తయారు చేసిన పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇంకా ఆలస్యం ఎందుకు,అది ఏంటో తెలుసుకుందాం పదండి..

దీని కోసం ఒక కప్పు బాదం,ఒక కప్పు కూల్ మఖాన్ అరకప్పు జీడిపప్పు,ఒక కప్పు నువ్వులు తీసుకొని, మందపాటి కడాయిలో వేసి ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని,గోరువెచ్చగా ఉన్నప్పుడే పౌడర్ లా మిక్సీ పట్టుకోవాలి.ఇలా మిక్సీ పట్టుకున్న ఈ ప్రోటీన్ పౌడర్ ని రోజుకు ఒక స్పూన్ పాలలో కలిపి ఇవ్వడం వల్ల,పిల్లలు ఈజీగా హైట్ పెరుగుతారు.ఎందుకంటే..

నువ్వులు..

ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ-ఆక్సిడెంట్ మన జీవక్రియ మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాక ఇది శరీరానికి కావాల్సినంత క్యాల్షియంని అందించడంతో పాటు,ఎముకలను దృఢంగా చేస్తాయి.మరియు నువ్వులు పిల్లల ఎదుగుదలకు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

మఖానా..

ఈ మఖాన తినడం వల్ల శరీరానికి అవసరమైనటువంటి క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది.ఇది బోన్ డెన్సిటీని పెంచడంతోపాటు,పిల్లల ఎముకలను బలపరుస్తుంది.

బాదం..

బాదం పప్పులు తినడం వల్ల మెదడు ఉత్తేజం అవడంతో పాటు,జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బాదంపప్పులలో వున్న ప్రోటీన్ పిల్లల యొక్క శారీరక అభివృద్ధి కూడా విరివిగా ఉపయోగపడుతుంది.

జీడిపప్పు..

ఇది మనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.ఇందులో ఫైబర్, మెగ్నీషియం,పొటాషియం,కాల్షియం లాంటివి ఎన్నో పుష్కలంగా లభించి హైట్ ను తొందరగా పెంచుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: