సమ్మర్ వచ్చిందంటే చాలు రకరకాల జ్యూస్ లు పానియాలు తయారు చేసుకుని తాగుతారు.శరీరానికి వాటర్ ఎక్కువగా కావాలి కాబట్టి కొంతమంది ఎక్కువగా ఓన్లీ వాటర్ తీసుకుంటూ ఉంటారు.ఇలా చేయడం వల్ల అతి మూత్రం ఎక్కువగా పోయి యూరిన్ ట్యూబ్స్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మూత్రాసయ సమస్యలు తలెత్తుతాయి.అంతే కాకుండా ఓన్లీ వాటర్ తాగటం వల్ల పెద్దగా ఉపయోగాలు కూడా ఏమి ఉండవు.అయితే వాటర్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పొడిని కలిపి తాగితే శరీరానికి చాలా మేలుచేస్తుంది.మరి అదేంటో చూద్దాం. ఈ పొడిని ఇంట్లోనే ఈజీ గా తయారు చేసుకోవచ్చు.పెద్ద ఖర్చు కూడా ఉండదు. మరి ఈ పొడి తయారీ విధానం తెలుసుకుందాం.


పటిక బెల్లం ఒక పావుకేజీ తీసుకొని మెత్తగా పౌడర్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత వంద గ్రాములు సోంపు తీసుకోండి,ఇప్పుడు ఒక పదిహేను లేదా ఇరవై పొట్టు తియ్యని బాధం ని తీసుకుకోండి.వీటిలో నాలుగు యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిపెట్టుకున్న పటికబెల్లం పొడిని ఇందులో వేయాలి. రెండిటిని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ఒక డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ పొడిని వాటర్ తాగాలి అనుకున్న ప్రతిసారి ఒక గ్లాస్ వాటర్లో ఒక చెంచా పొడిని కలిపి తీసుకోండి.ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.వంట్లో వేడిని తగ్గిస్తుంది. వేడిని తగ్గించే గుణాలు పటికబెల్లం లో సోంపులో అధికంగా ఉన్నాయి.యాలకులు అరుగుదలకి గ్యాస్ట్రిక్ సమస్య కి బాగా పని చేస్థాయి. బాధంలోని గుణాలు రక్తహీనతని తగ్గించి రక్తాని వృద్ధి చేస్తుంది. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటితో తయారు చేసుకున్న పొడిని తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.ఎండాకాలం వస్తుంది కాబట్టి దీన్ని తీసుకోవడం మంచిది. వాటర్లో నే కాదు,రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలలో దీన్ని కలిపి తాగి పడుకోవడం వల్ల నిద్ర లేమి సమస్య ఉన్నవాళ్ళకి కంటినిండా చక్కగా నిద్ర పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: