రక్తదానం, అవయవదానం ఇలా ఇప్పటివరకు అందరూ కూడా ఎన్నో రకాల దానాలు గురించి వినే ఉంటారు. అయితే రక్తదానం చేయడం ద్వారా ఒక మనిషికి పునర్జన్మను ప్రసాదించే అవకాశం ఉంటుంది అని ఇక ఎంతోమంది అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో చాలామంది ఇక రక్త దానం చేసి మరొకరి ప్రాణాన్ని నిలబెట్టేందుకు ముందుకు వస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఇంకొంతమంది కాస్త పెద్ద మనసు చేసుకొని తాము చనిపోయిన తర్వాత ఏకంగా తమ అవయవాలను మరొకరికి ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. తద్వారా ఇక తమ అవయవాలతో ఎంతోమందికి పునర్జన్మను ప్రసాదిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా రక్తదానం, అవయవ దారం చేయడం చేస్తారని.. ఇలా చేయడం ద్వారా ఎంతో మంచి జరుగుతుందని  అందరికీ తెలుసు. అయితే ఈ వీటితో పాటు అటు ఏకంగా చర్మదానం కూడా చేస్తారు అన్న విషయం ఎవరికైనా తెలుసా.. స్కిన్ డొనేషన్ ఏంటి కొత్తగా వింటున్నాం అని అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ రక్త దానం అవయవదానం ఎలా అయితే చేస్తారో అచ్చం.  అలాగే ఇక ఎంతోమంది వ్యక్తులకు స్కిన్ డొనేషన్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన న్యూస్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 అయితే రక్తదానం చేయాలి అనుకునే వారి దగ్గర నుంచి రక్తాన్ని సేకరించి తమ దగ్గర స్టోర్ చేసుకుని ఇక అవసరమైన వారికి అందించేందుకు ఎలా అయితే బ్లడ్ బ్యాంకులు మన దేశంలో ఉన్నాయో.. ఇక అలాగే స్కిన్ డొనేషన్ చేసే వారి కోసం కూడా ప్రత్యేకంగా 27 స్కిన్ బ్యాంకులు మన దేశంలో ఉన్నాయట. మరణించిన వారి చర్మం కూడా దానం చేసేందుకు అవకాశం ఉంటుందట  చనిపోయిన 6 నుంచి 8 గంటల్లో చర్మం సేకరించాలని వైద్యులు చెబుతున్నారు. అయితే దాతలకు హెచ్ఐవి, హైపటైటిస్ బి, సి లాంటి చర్మ వ్యాధులు ఉండకూడదు అని వైద్యులు చెబుతున్నారు. ఇక ఆరోగ్యమైన వందేళ్ల వరకు కూడా చర్మం దానం చేసేందుకు అవకాశం ఉంటుందట. అప్పటికే నొప్పితో ఉన్న క్షతగాత్రులకు ఇక శరీరంలోని మరో చోటు నుంచి చర్మాన్ని తీసి చికిత్స చేయడం కంటే ఇలా వేరొకరు డొనేట్ చేసిన చర్మంతో చికిత్స అందించడం ద్వారా కాస్త ఉపశమనం ఉంటుంది అని వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: