మన పూర్వీకుల నుంచి మనం ఎన్నో రకాల గింజలను చూస్తూనే ఉంటాము. అలాంటి వాటిలో పొద్దుతిరుగుడు గింజలు కూడా ఒకటి.. సాధారణంగా వీటిని కుసాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. పలు రకాల ప్రాంతాలలో పలు రకాల పేర్లతో కూడా వీటిని పిలుస్తూ ఉంటారు. అయితే ఇందులో ఎన్నో పోషకాలు కూడా చాలా సమృద్ధిగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల కూడా ఎముకలు చాలా దృఢంగా మారడమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుందట.


పొద్దు తిరుగుడు గింజలని ప్రతిరోజు తినడం వల్ల.. శరీరానికి ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరం చేస్తాయి. ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నవి.. ఒత్తిడికి గురికాకుండా ఉంచేలా పొద్దుతిరుగుడు విత్తనాలు పనిచేస్తాయి. ఇందులో ఉండేటువంటి విటమిన్-E, మెగ్నీషియం, జింక్ ఇతరత్రా పోషకాలు ఇందులో ఉంటాయి. పొద్దుతిరుగుడు గింజలలో ఎక్కువగా పాలిసాకరైడ్ అనే రకమైన కొవ్వు పదార్ధం కలిగి ఉంటుంది. అలాగే లినోలెనిక్ ఆమ్లాలు కూడా కలిగి ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ఉపయోగపడతాయట.


అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు పొద్దుతిరుగుడు విత్తనాలను తినడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు.. అలాగే పండ్లు లేదా జ్యూస్ నీ తాగడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా కనిపిస్తుంది. దీని వల్ల కూడా బరువుని అదుపులో ఉంచేలా చేస్తుంది. పొద్దు తిరుగుడు విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా సమృద్ధిగా లభిస్తాయి. ఇవి క్యాన్సర్ ఇతరత్రా వ్యాధులనుంచి బయటపడేలా సహాయపడతాయి. అలాగే చర్మం ఎల్లప్పుడూ కూడా మెరిసేలా ఉండడంలో సహాయపడుతుంది.


మెదడు చురుకుగా పనిచేయాలన్న ఆరోగ్యంగా ఉండాలన్న పొద్దుతిరుగుడు విత్తనాలను తినడం మంచిది. ఇందులో ఎక్కువగా క్యాల్షియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ని కూడా వంటలకి ఉపయోగిస్తూ ఉండడం వల్ల వంట రుచిగా ఉంటుంది. పొద్దు తిరుగుడు గింజలను తినడం వల్ల కీళ్లనొప్పులు ఆస్తమా వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: