ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈసారి టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసేసింది. దాదాపు 161 అసెంబ్లీ స్థానాలలో కూటమి గెలిచింది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఈసారి హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డ శిల్పా రవిచంద్రా కిషోర్‌ రెడ్డికి సపోర్ట్ చేశారు ఆయన కోసం ప్రతి సమేతంగా నంద్యాల వెళ్లి మరీ ప్రచారం చేశారు. అయితే టీడీపీ కూటమి అభ్యర్థి     ఎన్‌ఎండీ ఫరూక్‌ చేతిలో రవిచంద్ర కిషోర్ రెడ్డి దారుణంగా ఓడిపోయారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 268,142.

* 2024 ఎన్నికల రిజల్ట్

21 రౌండ్లలో 18 రౌండ్లు ముగిసేసరికి టీడీపీ నేత ఎన్‌ఎండీ ఫరూక్‌ 89,472 ఓట్లు సాధించారు. శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి 78,104 ఓట్లు గెలుచుకున్నారు. ఫరూక్‌ 11,368 ఓట్ల మెజార్టీతో రవిచంద్రపై ఘన విజయం సాధించారు.

శిల్పా రవిచంద్రా కిషోర్‌ రెడ్డి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తనయుడు. సెట్టింగ్ ఎమ్మెల్యే రవిచంద్ర బిజినెస్ మేనేజ్మెంట్‌లో డిప్లమా చేశారు. ఈయన శిల్పా సహకార పేరిట సేవా కార్యక్రమాలను చేపడుతుంటారు. ఈయనకు సినీ నటుడు అల్లు అర్జున్ సపోర్ట్ చేసినా కూడా అది అయిపోయింది.

మైనారిటీ నేత ఎన్‌ఎండీ ఫరూక్‌ టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి అందులోనే కొనసాగుతున్నారు. 1985లో ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ మంత్రివర్గంలోనూ పనిచేశారు. 1994, 99 ఎన్నికల్లో కూడా గెలిచారు. డిప్యూటీ స్పీకర్ గా, మంత్రిగా కూడా వర్క్ చేశారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

నంద్యాల అర్బన్, నంద్యాల రూరల్, గోస్పాడు వంటి మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ 76 వేల ముస్లిం ఓటర్లు, 42 వేల బలిజ, 37 వేల ఎస్సీ, 25 వేల రెడ్డి, 20 వేల వైశ్య ఓట్లు ఉన్నాయి. నంద్యాల నియోజకవర్గం భారతదేశానికి ప్రధాన మంత్రులను, రాష్ట్రపతులను అందించింది. ఎన్‌ఎండీ ఫరూక్‌ మైనారిటీ ఓటర్లతోనే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు, ఇప్పుడు అదే జరిగింది.

అయితే రవిచంద్ర గడిచిన 5 ఏళ్లలో ఓన్లీ వీకెండ్స్ లో మాత్రమే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేవారు. అందుకే ఆయనకు సండే ఎమ్మెల్యే అనే పేరు వచ్చింది. మిగతా రోజుల్లో ఆయన చిక్కడు దొరకడు లాగా ఉండేవాడని, ఆ సమయంలో నియోజకవర్గ ప్రజలను గాలికి వదిలేసేవారని తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే రవిచంద్ర 25 వేల ఓటు బ్యాంకును కలిగి ఉన్నారు. మిగతా ఓట్ల కోసం ఆయన పోటీ పడ్డారు కానీ పెద్దగా గెలుచుకోలేకపోయారు. శిల్పా సహకార ద్వారా చేసిన సేవా కార్యక్రమాల వల్ల ఈ నియోజకవర్గ ప్రజల్లో ఆయనకు వేల మంది ఓట్లు వేసే అవకాశముందని భావించారు కానీ అది జరగలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: