మన బాడీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే మనకు అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఖచ్చితంగా చాలా అవసరం. వాటిల్లో ఐరన్ అనేది ఖచ్చితంగా చాలా అవసరం. ఐరన్ మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇంకా అలాగే రక్తం ఎక్కువగా తయారయ్యేలా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయం చేస్తుంది. అందువల్ల ఐరన్ ఉండే ఆహారాలను మనం ప్రతి రోజూ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఐరన్ వేటిలో ఉంటుంది? అని మీరు సందేహ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే ఈ గింజలను ప్రతి రోజూ తింటే చాలు, దాంతో మన శరీరానికి ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దీని వల్ల పైన తెలిపిన ప్రయోజనాలు మన శరీరానికి కలుగుతాయి. ఇక ఐరన్ అధికంగా ఉండే ఆ గింజలు గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.అవిసె గింజలను  ఆహారంలో భాగం చేసుకుంటే రక్త హీనత సమస్య ఈజీగా మాయం అవుతుంది. దీంతో బాడీకి ఐరన్ లభిస్తుంది. ఇది మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది.


అలాగే పొద్దుతిరుగుడు విత్తనాలను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటి ద్వారా కూడా మనకు ఐరన్ లభిస్తుంది. 1 ఔన్సు పొద్దు తిరుగుడు గింజలను తింటే సుమారుగా 1.4 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. దీంతోపాటు విటమిన్ ఇ, మెగ్నిషియం, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు కూడా లభిస్తాయి.నువ్వులను రోజూ తినడం వల్ల కూడా మనకు ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ నువ్వులను తిన్నా చాలు 1.3 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. అలాగే క్యాల్షియం, మెగ్నిషియం, కాపర్ కూడా మనకు నువ్వుల ద్వారా లభిస్తాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి.అలాగే ఐరన్ ఎక్కువగా ఉండే గింజల్లో గుమ్మడికాయ గింజలు కూడా ఒకటి. ఒక ఔన్సు గుమ్మడికాయ విత్తనాలను తింటే 2.5 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. మనకు రోజుకు కావల్సిన ఐరన్‌లో ఇది 14 శాతంగా ఉంటుంది. అందువల్ల రోజూ ఈ గింజలను తినాలి. దీంతో మనకు మెగ్నిషియం, జింక్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా లభిస్తాయి. అలాగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కాబట్టి ప్రతి రోజూ గుమ్మడి గింజలను తినాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: