- ( ఇండియా హెరాల్డ్ - హెల్త్ టిప్స్ ) . . .

మీ వ‌య‌స్సు 40 నలభై ( 40 ) దాటుతుందంటే.. మీరు చాలా బాధ్యతాయుతంగా మెలగాలి. మీ కుటుంబానికి మీరే ఆధారం. మీ వయస్సు 40 ప్లస్ అయితే ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిందే. అందుకే ఈ ఏడు సూత్రాలు పాటించండి.. ఆరోగ్యం కాపాడుకోండి.. యవ్వనంగా కనిపించండి.. అవేమిటంటే..


ఒకటో సూత్రం.. ఈ రెంటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించండి.. 1. బి.పి., 2. షుగరు..
రెండో సూత్రం.. ఈ నాలుగింటిని సాధ్యమైనంత తగ్గించండి. 1. ఉప్పు, 2. చక్కెర, 3. డైరీ తయారీలు, 4. పిండి పదార్థాలు
మూడో సూత్రం.. ఈ నాలుగింటిని ఎక్కువ తీసుకోండి. 1. ఆకుకూరలు, 2. కూరగాయలు, 3. పండ్లు, 4. గింజలు
నాలుగో సూత్రం.. ఈ మూడింటిని మరచిపొండి. 1. మీ వయస్సు, 2. గడిచిపోయిన రోజులు,3. కోపతాపాలు


ఐదో సూత్రం ..ఈ మూడింటినీ పొందుటకు చూడండి. 1. ప్రాణ స్నేహితులు, 2. ప్రేమించే కుటుంబం, 3. ఉన్నతమైన ఆలోచనలు
ఆరో సూత్రం .. ఆరోగ్య వంతులుగా ఉండడానికి ఈ క్రింది వాటిని పాటించండి. 1. నియమిత ఉపవాసం, 2. నవ్వడం, 3. వ్యాయామం, 4. బరువు తగ్గుట
ఏడో సూత్రం.. ఈ నాలుగు విషయాలకై ఎదురుచూడకండి.
1. నిద్ర పోవడానికై నిద్ర వచ్చేవరకు కాచుకొని ఉండకండి.
2. విశ్రాంతి తీసుకోవడానికై అలసిపోయే వరకు ఉండకండి.
3. స్నేహితుడిని కలవడానికై అతను ఎదురుచూడడం మానేసేంత ఆలస్యం చేయకండి.
4. దేవుడిని ప్రార్థించడానికై కష్టాలు వచ్చేంతవరకు ఆగకండి.


9490520108.. ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మ‌స్య‌లు, ఎమ్మెల్యేల ప‌నితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్ర‌జ‌ల ఇబ్బందులు, అక్క‌డ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల ప‌రిస్థితులు, రాజ‌కీయ అంశాల‌పై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: