ఏపీలో లో వడగాల్పుల ధాటి!
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు దంచి కొడుతున్నాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడం గమనార్హం.ప్రధానంగా రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.పల్నాడు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎండల తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అమరావతి వాతావరణ శాఖ నిరంతరం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది.
తెలంగాణలోనూ గరిష్టంగా...
తెలంగాణలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్ వాతావరణ శాఖ 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.పగటివేళ వీధులన్నీ ఎడారిని తలపిస్తున్నాయి. ప్రజలు తమ పనుల కోసం ఉదయం 7 గంటల లోపు లేదా సాయంత్రం 5 గంటల తర్వాతే బయటకు వస్తున్నారు.
ఎండల ధాటికి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులు, దగ్గు, కళ్లు మంటలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
డాక్టర్ల సలహా: “అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, దీర్ఘకాలిక రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరో నెల రోజుల పాటు మనం ‘డేంజర్ జోన్’ లోనే ఉన్నాం.”
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
మంచినీరు అధికంగా తాగాలి: దాహం వేయకపోయినా నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగుతూ ఉండాలి.
వేదురు దుస్తులు: లేత రంగు నూలు దుస్తులు ధరించడం శ్రేయస్కరం.
గొడుగు తప్పనిసరి: తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు లేదా టోపీ, సన్ గ్లాసెస్ వాడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి