మే 7వ తేదీన ఒకసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు ఎన్నో ముఖ్య సంఘటనలు జరిగాయి ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి  ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనలు  ఏంటో తెలుసుకుందాం రండి. 

 

 రవీంద్రనాథ్ ఠాగూర్ జననం : భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈయన 1861 మే 7వ తేదీన జన్మించారు. ఠాగూర్ గా రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఇక నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి గా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు రవీంద్రనాథ్ ఠాగూర్.చిన్నప్పటి నుంచి  కథలు వినడానికి ఎంతో ఇష్టపడే రవీంద్రనాథ్ ఠాగూర్ సామాన్య దుస్తులతో నిరాడంబరంగా ఉండేవారు. బాల్యంలో కేవలం ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండవలసిన రావడంతో ఆయనకు బయటి ప్రపంచం అద్భుతంగా తోచేది. ప్రపంచం అనేది ఒక రహస్యమని ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని కుతూహలం పడేవారు రవీంద్రనాథ్ ఠాగూర్. బాల్యంలోనే అనేక పద్యాలు వ్యాసాలు విమర్శలు ప్రచురించాడు రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన సంధ్యా గీత్ కావ్యాన్ని కవులందరూ మెచ్చుకునేవారు. వందేమాతరం గీతాన్ని రచించిన బంకించంద్ర ఛటర్జీ కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ ని ప్రశంసించాడు. ఎన్నో భక్తి గీతాలను కూడా రచించినవారు రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటి నుంచి జాతీయ భావాలు కలిగి ఉన్న వ్యక్తి. హిందూ మేళాలో దేశభక్తి గీతాలను పాడాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక వందేమాతరాన్ని జనగణమన గీతాలలో ఏ గీతాన్ని  జాతీయ గీతంగా ప్రకటించాలనే దానిపై  సుదీర్ఘంగా చర్చ జరిగింది. అంతిమంగా జనగణమన  జాతీయ గీతం గా మారిపోయింది. 

 

 ఆచార్య ఆత్రేయ జననం : ఆచార్య ఆత్రేయ గా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు 1921 మే 7వ తేదీన జన్మించారు. తెలుగులో సుప్రసిద్ధ నాటక రచయిత సినిమా పాటలు మాటల రచయిత నిర్మాత దర్శకులు ఆత్రేయ. దాదాపు నాలుగు వందల సినిమాలకు మాటలు పాటలు రాసిన గొప్ప కవి ఆచార్య ఆత్రేయ. ఆత్రేయ రాసిన పాటలు నాటకాలు నాటికలు కథలు మొదలగు రచనలని 7 సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించారు అని చెప్పవచ్చు. తెలుగు సినిమా గేయ రచయితగా సంభాషణ కర్తగా ఆచార్య ఆత్రేయ పేరు పొందినప్పటికి నిజానికి అతను  నాటకాల్లో స్థానం సుస్థిరం. నాటక రచయితగా ఆచార్య ఆత్రేయ స్థానం ఎప్పటికీ సుస్థిరమైన. మనసు కవి సినిమావారు పిలుచుకునే ఆత్రేయ నాటకాలు చక్కని ప్రయోగాలు చేసిన నాటక రంగాన్ని మలుపు తిప్పారు. 

 

 సందీప్ కిషన్ జననం : తెలుగు యువ హీరోలలో ఒకరైన సందీప్ కిషన్ సినీ  ప్రేక్షకులందరికీ కొసమెరుపు. సందీప్ కిషన్ 1987 మే 7వ తేదీన చెన్నైలో జన్మించారు. ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు సందీప్ కిషన్. ప్రస్తుతం తెలుగు యువ హీరోలలో ఒకరిగా దూసుకుపోతున్నారు సందీప్ కిషన్. ఎన్నో  సినిమాలు చేసుకుంటూ ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించారు సందీప్ కిషన్. ఎన్నో చెప్పుకోదగ్గ విజయాలను కూడా అందుకున్నారు. 

 

 

 అల్లూరి సీతారామరాజు మరణం : భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. శాంతి ద్వారా కాదు సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం సిద్ధిస్తుందని నమ్మి ముందుకు సాగి ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజు. ఈయన బ్రిటిష్ తూటాలకు ఎదురొడ్డి నిలబడి విప్లవ యోధుడికి వీర మరణం పొందారు. ఈయన 1924 మే 7వ తేదీన మరణించారు. 

 

 

 దామోదరం సంజీవయ్య మరణం : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి తొలి దళిత ముఖ్యమంత్రి అయిన  దామోదరం సంజీవయ్య 1972 జూన్ 7వ తేదీన మరణించారు. సంయుక్త మద్రాస్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించారు దామోదరం సంజీవయ్య. రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 

 

 గుండారామి రెడ్డి మరణం : తొలి తరం తెలంగాణ ఉద్యమకారుడు 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 1958 జనవరి 27న వాణిజ్యపన్నుల అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ పోరాటంలో పాల్గొని తన పేరును తెలంగాణ రామిరెడ్డిగా పేరు మార్చుకున్నారు... ఈయన 2019 మే 7వ తేదీన మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: