మే 20వ తేదీన ఒకసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు...ఎంతో మంది  మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి హిస్టరీ లోకి వెళ్లి ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 బాలు మహేంద్ర జననం  : భారతీయ సంస్కృతి ఛాయాగ్రాహకుడు దర్శకుడు కళాత్మక చిత్రాలను తీయడంలో ఎంతగానో పేరుగాంచిన వ్యక్తి అయిన  బాలుమహేంద్ర 1939 మే 20వ తేదీన జన్మించారు. ఇప్పుడు వరకు ఏకంగా అయిదు జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. మొదటి ఛాయాగ్రాహకుడు తమిళ చిత్రసీమలో ప్రవేశించారు బాలుమహేంద్ర. అనంతరం ఆయన స్క్రీన్ప్లే-దర్శకత్వం నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి తనదైన శైలిలో చిత్రాలను రూపొందించారు. దక్షిణాదిన అన్ని భాషల్లో రూపొందించిన చిత్రాలకు పనిచేశారు. 2014 ఫిబ్రవరి 13వ తేదీన గుండెపోటుతో మరణించారు బాలుమహేంద్ర. 

 

 సిరివెన్నెల సీతారామశాస్త్రి జననం : సినీగేయ రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించి... ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి 1955 మే 20వ తేదీన జన్మించారు. సిరివెన్నెల సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామ శాస్త్రి... తన మొదటి సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. పాటలలో ప్రతి పదానికి ప్రాణం పోసే విధంగా ఎంతో అర్థం వచ్చే విధంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలు ఉంటాయి. ప్రస్తుతం ఎన్నో సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గేయ రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఒక పాటకి అద్భుతమైన లిరిక్స్ అందించి  ప్రేక్షకులను మైమరపింప  చేయడంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి దిట్ట అని చెప్పాలి. అయితే ఆయన అందించిన సేవలకు గాను ఏకంగా భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 

 

 పరిటాల సునీత జననం  : పెనుకొండ దివంగత శాసనసభ్యులు అయిన పరిటాల రవి సతీమణి పరిటాల సునీత 1970 మే 20వ తేదీన జన్మించారు.  2005 సంవత్సరంలో శాసనసభ్యురాలుగా  మొదటి సారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాప్తాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు ఎన్నికయ్యారు. 

 

 జూనియర్ ఎన్టీఆర్ జననం : జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకులందరికీ కొసమెరుపు. నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన జూనియర్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో గా కొనసాగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 1983 మే 20వ తేదీన జన్మించారు. నటనకు నిలువెత్తు రూపం అయిన ఎన్టీఆర్ ఎలాంటి పాత్రకి  అయినా సరే తన నటనతో ప్రాణం పోస్తూ ఉంటారు. ప్రస్తుతం ఎంతో మంది యువ హీరోలకు ఆదర్శంగా నిలుస్తోన్నారు  జూనియర్ ఎన్టీఆర్. ఓ వైపు డాన్స్ పర్ఫార్మెన్స్ లతో మరోవైపు తన నటనతో ఆకట్టుకుంటున్నారు. 

 

 మంచు మనోజ్ జననం  : ప్రముఖ తెలుగు నటుడు అయిన మంచు మనోజ్ 1984 మే 20వ తేదీన జన్మించారు. మంచు మోహన్ బాబు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మంచు మనోజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో రియలిస్టిక్  స్టార్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులు సంపాదించారు. 

 

 

 బిపిన్ చంద్రపాల్ మరణం : సుప్రసిద్ధ  స్వాతంత్ర సమరయోధులు అయిన బిపిన్ చంద్రపాల్ 1982 మే 20వ తేదీన మరణించారు. లాల్  బాల్ పాల్ త్రయంలో  మూడోవాడు చంద్రపాల్. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి బిపిన్ చంద్రపాల్. 

 

 

 టంగుటూరి ప్రకాశం పంతులు మరణం : స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయిన  టంగుటూరి ప్రకాశం పంతులు 1957 మే 20వ తేదీన మరణించారు. నిరుపేద  కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకుని ఏకంగా ఆంధ్ర  మొదటి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు టంగుటూరి ప్రకాశం పంతులు. 

 

 కాసు బ్రహ్మానంద రెడ్డి మరణం : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గుంటూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు అయిన కాసు బ్రహ్మానందరెడ్డి 1994 మే 20వ తేదీన మరణించారు . కేంద్ర రాష్ట్రాల్లో ఎన్నో కీలక మంత్రి పదవులతో పాటు అనేక పార్టీ పదవులను కూడా నిర్వహించారు కాసు బ్రహ్మానంద రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: