జూలై 17 వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు జరిగిన ముఖ్య సంఘటనలు సంభవించిన మరణాలు ఏంటో తెలుసుకుందాం రండి.
ఒలంపిక్ గేమ్స్ బహిష్కరణ : 1976 కెనడాలోని మాంట్రియల్ లో జరిగిన 21వ ఒలింపిక్ క్రీడలను 25 ఆఫ్రికన్ దేశాలు బహిష్కరించాయి.
దుక్కిపాటి మధుసూదనరావు జననం: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత అయిన దుక్కిపాటి మధుసూదనరావు 1917 జూలై 17వ తేదీన జన్మించారు. అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై సినిమాలు నిర్మించిన తెలుగు నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు. 1940 నుంచి తెలుగు చిత్ర పరిశ్రమతో ఎంతో అనుబంధం ఏర్పరచుకున్నారు దుక్కిపాటి మధుసూదనరావు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సినీ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన వారిలో దుక్కిపాటి మధుసూదన రావు కూడా ఒకరు, అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థను 1951 సెప్టెంబర్ 10వ స్థాపించారు. ఇక ఈ నిర్మాణ సంస్థ నుంచి మొదట దొంగరాముడు అనే సినిమాని తెరకెక్కించారు. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో అద్భుతమైన చిత్రాలను నిర్మించి నిర్మాతగా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించారు దుక్కిపాటి మధుసూదనరావు.
రంగనాథ్ జననం: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన విలక్షణమైన సినీ నటుడు అయిన రంగనాథ్ 1949 జూలై 17 వ తేదీన జన్మించారు. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం రైల్వే శాఖలో టిక్కెట్ కలెక్టర్ గా పనిచేసిన రంగనాథ్ ఆ తర్వాత వెండితెర వైపు అడుగులు వేశారు. ఏకంగా తెలుగు చిత్ర పరిశ్రమలో మూడు వందల సినిమాలకు పైగా నటించి ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా విబిబిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులందరి మనసులు గెలుచుకున్నాడు ఈయన . మొగుడ్స్ పెళ్ళామ్స్ అనే చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. కేవలం నటన పరంగా తెలుగు చిత్ర పరిశ్రమలో తన సత్తా చాటడమే కాదు మంచి రచయితగా కూడా ఈయన గొప్ప ప్రతిభావంతుడు. అయినా ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో నటించడంతో తెలుగు ప్రేక్షకులందరికీ మరింత దగ్గరయ్యారు.
రవి కిషన్ జననం : తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు రవికిషన్ 1969 జూలై 17 వ తేదీన జన్మించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనలోని నటుణ్ణి తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రేక్షకులకు కూడా పరిచయం చేశారు రవి కిషన్. తెలుగు తమిళ కన్నడ సినిమాల్లో ఎంతగానో గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా భోజ్ పురి సినిమా ద్వారా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన రవికిషన్ ఆ తర్వాత ఎన్నో భాషల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి తన నటనతో ఎంతగానో గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా తెలుగు చిత్రపరిశ్రమలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డి అనే పాత్ర తెలుగు ప్రేక్షకులకు రవికిషన్ ను మరింత దగ్గర చేసింది.
ఓగిరాల రామచంద్రరావు మరణం : పాతతరం తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు అయిన ఓగిరాల రామచంద్రరావు 1957 జులై 17 వ తేదీన పరమపదించారు. వాహిని వారి చిత్రాలు ఎన్నింటికో ఓగిరాల సంగీతం అందించి సంగీత ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఈయన తెలుగు చలన చిత్ర రంగంలో లో మొట్టమొదటి నేపథ్యగాయకుడిగా పని చేశారు. అంతేకాకుండా పలు సినిమాల్లో నటుడిగా గుర్తింపు సంపాదించారు. దాదాపు ఇరవై చిత్రాలకుపైగా సంగీతదర్శకుడిగా పని చేశారు ఓగిరాల. సంగీత దర్శకుడిగా ఓగిరాల ప్రస్థానం ఎంతో విజయవంతంగా కొనసాగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి