జులై 31వ తేదీన ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెల్లి నేడు జన్మించిన ప్రముఖులు సంభవించిన మరణాలు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి.


ప్రేమ్ చంద్  జననం : భారత దేశంలో ప్రఖ్యాతి చెందిన హిందీ ఉర్దూ కవి అయిన ప్రేమ్ చంద్  1880 జూలై 31 వ తేదీన జన్మించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి దగ్గర జరిగిన గగన  చంద్.. ఉర్దూ హిందీ భాషలలో ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.  తల్లిదండ్రులు బాల్యంలోనే మరణించడంతో సవతి తల్లి ఆమె పిల్లల  కీలక బాధ్యత ప్రేమ్ చంద్  పై పడింది. అయితే చిన్నప్పటి నుంచి కవితలు రచనలు రాయడంలో ఎంతో ఆసక్తి చూపడంతో... క్రమంగా మంచి గుర్తింపు సాధించి గొప్ప కవి గా ఎదిగారు ప్రేమ్ చంద్ .


అమర్ సింగ్ చౌదరి జననం : భారతదేశానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు అయిన  అమర్ సింగ్ చౌదరి 1941 జులై 31 వ తేదీన జన్మించారు. ఈయన గుజరాత్ రాజకీయాల్లో కీలకపాత్ర వహిస్తూ ఎంతో గొప్ప నేతగా ఎదిగారు. వివిధ మంత్రి పదవులను అలంకరించడమే  కాదు ఏకంగా గుజరాత్ కి ముఖ్య మంత్రిగా కూడా పనిచేశారు అమర్ సింగ్ చౌదరి. ఇలా గుజరాత్ రాష్ట్రంలో మొదటి ఆదివాసి ముఖ్యమంత్రిగా కూడా రికార్డు సృష్టించారు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగే సమయంలో ఆదివాసీల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అంతేకాకుండా రైతుల అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలను కూడా  ప్రవేశపెట్టారు అమర్ సింగ్ చౌదరి. కియారా అద్వానీ జననం  : భారతీయ చలన చిత్ర


పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అయిన కియారా అద్వానీ 1992 జూలై 31 వ తేదీన జన్మించారు, ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న కియారా అద్వానీ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.  అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించిన కియారా అద్వాని వరుస  సినీ అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోల సరసన నటించి ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. కేవలం హిందీ చిత్ర పరిశ్రమనే కాకుండా తెలుగులో కూడా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు కియారా  అద్వానీ. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు యాక్టివ్గా ఉండే కియారా అద్వానీ.. ఎంతోమంది అభిమానుల తన హాట్ హాట్ ఫోటో షూట్లతో అలరిస్తూనే ఉంటారు,



అల్లు రామలింగయ్య మరణం  : తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ నటుడు నిర్మాత అయిన అల్లు రామలింగయ్య 2004 జూలై 31 వ తేదీన మరణించారు. హాస్య ప్రధానమైన పాత్రల్లో నటిస్తూ ఎన్నో తరాల పాటు తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు అల్లు రామలింగయ్య. ప్రస్తుతం అల్లు రామలింగయ్య వారసులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అరవింద్ నిర్మాతగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా అల్లు రామలింగయ్య అల్లుడు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు,

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: