గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో డిసెంబ‌ర్ 22వ ‌తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు

1953: సయ్యద్ ఫజల్‌ఆలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పడింది ( 1953డిసెంబరు 29 చూడు).
2000: ఢిల్లీ లోని ఎర్రకోట లోనికి ప్రవేశించిన ఐదుగురు లష్కరేతొయిబా ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక సాధారణ పౌరుని హతమార్చారు.

ప్ర‌ముఖుల జననాలు


1887: ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, శ్రీనివాస రామానుజన్ (మ.1920). 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. ఇతడికి పది సంవత్సరాల వయసులోనే గణితశాస్త్రంతో అనుభందం ఏర్పడింది. చిన్న వయసులోనే గణితం పట్ల ప్రకృతి సిద్ధమైన ప్రతిభ కనపరిచేవాడు. ఆ వయసులోనే ఎస్ ఎల్ లోనీ త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను వంటపట్టించుకున్నాడు. పదమూడు సంవత్సరాలు నిండే సరికల్లా ఆ పుస్తకాన్ని ఔపోసన పట్టడమే కాకుండా తన సొంతంగా సిద్ధాంతాలు కూడా రూపొందించడం ప్రారంభించాడు.
1899: శొంఠి దక్షిణామూర్తి, ప్రసిద్ధి పొందిన వైద్యశాస్త్ర ప్రముఖుడు (మ.1975).వీరు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో డిసెంబర్ 221899 సంవత్సరం జన్మించారు. చెన్నైలో ఎం.బి.బి.అస్. పట్టా పొందిన అనంతరం ఇంగ్లాండులో ఉన్నత విద్యాభ్యాసం చేసి డి.పి.హెచ్., డి.టి.ఎం. అండ్ హెచ్. పట్టాలను, ఆర్.సి.పి.ఎస్.పట్టాలను పొందారు. లండన్లో పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా పొందారు. 
1955: సయ్యద్ నసీర్ అహ్మద్, హేతువాది, పాత్రికేయుడు, లాయర్,. 'సారేజహాఁ సే అచ్ఛా ఇండియా' తెలుగు మాస పత్రిక సంపాదకుడు.

ప్ర‌ముఖుల మరణాలు..

1958: తారక్‌నాథ్ దాస్, బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అంతర్జాతీయ విద్వాంసుడు. (జ.1884)
2014: జి.వెంకటస్వామి, భారత పార్లమెంటు సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యుడు. (జ.1929)
2015: కాశీ విశ్వనాథ్, ప్రఖ్యాత రచయిత, నటుడు, రంగస్థల ప్రయోక్త (జ.1946)


పండుగలు, జాతీయ దినాలు

జాతీయ గణిత దినోత్సవం.

మరింత సమాచారం తెలుసుకోండి: