తెలుగు సినిమా చ‌ర‌త్ర‌లోనే అత్యంత విల‌క్ష‌ణ న‌టుడు తిరుమల సుందర శ్రీరంగనాథ్. ఆయన 1949లో మద్రాసు నగరంలో టి.ఆర్.సుందరరాజన్, జానకీదేవి దంపతులకు జన్మించాడు. ఈయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ చేశాడు. రైల్వేశాఖలో టికెట్ కలెక్టర్‌గా కొంతకాలం పనిచేశాడు. 1969లో బుద్ధిమంతుడు సినిమాతో వెండితెరకు పరిచయమై సుమారు 300 సినిమాలలో నటించాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ నటుడిగా సినిమా ప్రేక్షకులను మెప్పించాడు. మొగుడ్స్ పెళ్లామ్స్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కొన్ని టీ.వీ.సీరియళ్లలో కూడా నటించాడు. రంగనాథ్ నటుడే కాదు మంచి కవి, రచయిత కూడా.


1969లో బుద్ధిమంతుడు సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించారు. చందన (1974) చిత్రంలో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. కెరీర్ ప్రారంభంలో కుటుంబ బాధ్య‌తులు మీద పడ‌టంతో సినీ జీవితం న‌మ్మకం కాద‌ని భావించి ఉద్యోగ ప్ర‌య‌త్నాలు చేశారు. బిఎ చ‌దువుతుండ‌గానే ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలో టిసిగా ఉద్యోగం వ‌చ్చింది. ఆ వెంటనే వెంట‌నే వివాహం. త‌రువాత పిల్లలు అలా జీవితం సాగిపోతున్నా న‌టుడవ్వాల‌న్న కోరిక మాత్రం చ‌చ్చిపోలేదు. త‌ను నాట‌కాలు వేసే నాట‌క‌రంగం వారి ద్వారా 1969లో చిన్న అవ‌కాశం వ‌చ్చింది. అయితే పాత్ర‌కు గుర్తింపు రాలేదు. అదే స‌మ‌యంలో బాపుగారి అందాల రాముడు సినిమాలో రాముడి వేషం, చంద‌న సినిమాలో హీరో వేషం ఒకేసారి వ‌చ్చాయి. దీంతో బాపుగారి స‌ల‌హాతో చంద‌న సినిమాకే అంగీక‌రించారు. అలా వెండితెర మీద హీరోగా రంగం ప్రవేశం చేశారు రంగ‌నాధ్. పంతుల‌మ్మ సినిమాతో స్టార్ హీరోగా మారారు.


ఎక్కువ‌గా కుటుంబ క‌థా చిత్రాల్లో న‌టించ‌టం ఆయ‌నను మ‌హిళ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర చేసింది. కానీ సినీ రంగంలో వ‌చ్చిన మార్పులు కార‌ణంగా కెరీర్ స్టార్టింగ్ లోనే ఒడిదుడుకులు వ‌చ్చాయి. దీంతో మ‌రో మార్గం లేక విల‌న్ గా మారారు. 'గువ్వ‌ల జంట' సినిమాతో తొలి సారిగా ప్ర‌తినాయ‌క పాత్ర‌లో అల‌రించారు. ఆ త‌రువాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గాను మెప్పించారు. వెండితెర మీదే కాదు.. బుల్లి తెర మీద కూడా తన న‌ట‌న‌తో ఆకట్టుకున్నారు రంగ‌నాధ్. పౌరాణిక నేప‌థ్యంతో తెర‌కెక్కిన భాగ‌వ‌తం సీరియ‌ల్ తో పాటు, రాఘ‌వేంద్ర‌రావుగారి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణలో తెర‌కెక్కిన శాంతినివాసం సీరియ‌ల్ లోనూ కీల‌క పాత్ర‌లో న‌టించారు.


అపార సినీ అనుభ‌వం క‌లిగిన ఆయ‌న మొగుడ్స్ పెళ్లామ్స్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా వ‌ర్క్ అవుట్ కాక‌పోవ‌టంతో త‌రువాత ద‌ర్శ‌క‌త్వనికి దూర‌మ‌య్యారు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ సినీరంగంతో అనుబందాన్ని కొన‌సాగిస్తున్న ఆయ‌న అర్థాంత‌రంగా త‌నువు చాలించారు. వీరు రచించినకవితా సుదర్శనం, అంతరంగ మథనం, ఈ చీకటి తొలగాలి, పదపరిమళం, అక్షర సాక్ష్యం, రంగనాథ్ కథలు, రంగనాథ్ నడత పుస్తకాలు అచ్చయ్యాయి. వీరు డిసెంబరు 19, 2015 న హైదరాబాదు లోని తన స్వగృహంలో మరణించాడు.


ఆయన భార్య ప్రమాదవశాత్తూ బాల్కనీ నుంచి కింద పడి, 14 ఏళ్ళ పాటు మంచానికే పరిమితమైపోతే కట్టుకున్నవాడే కన్నబిడ్డలా సపర్యలు చేశాడు. కానీ, గొప్ప చెప్పుకోలేదు. ‘నాలో సగభాగమైన భార్యకు చేయడం సేవ ఎందుకవుతుంద’నేవారు. 2009లో ఆమె కన్ను మూశారు.ఆమె ఫోటోను దేవుడి పటాలతో పాటు చేర్చి పూజచేసేవారు. ఆ పటం పైన డిస్టినీ అని రాసుకున్నారు. రంగనాధ్ ఒక ఇంటర్వూలో గతంలో తను రైలుక్రింద పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు, రైలు ఆలస్యం కావడం వల్ల మనసు మార్చుకుని అమ్మఆశయం కోసం నటుడిగా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేసారు.


యువనటుడూ సినీ కథానాయకుడు ఉదయకిరణ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు అతను ఆ పిచ్చిపని ఎందుకు చేసాడు అంటూ తన అభిప్రాయం వెలిబుచ్చారు. కానీ 2015లో అర్ధాంతరంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.మరణించే ముందు గుడ్ బై సర్ అంటూ తన మిత్రుడు బైస దేవదాస్ గారికి సందేశం పంపారు. తనకు వంటచేసే పనిమనిషి మీనాక్షికి బీరువాలో దాచిన ఆంధ్రభ్యాంకు బాండ్లు అందవలసినదిగా గోడలపై రాసి డోంట్ ట్రబుల్ హర్ అంటూ తెలియజేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: