క్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు జూన్ 16వ కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో..  ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

జననాలు:

1903: ఆచంట జానకిరాం, సుప్రసిద్ధ రేడియో ప్రసార ప్రముఖులు, రచయిత, మొదటి డైరక్టర్ జనరల్ లైవిల్ ఫీల్డెన్ నియమించిన ఫస్ట్ జనరేషన్ వారిలో ప్రధములు. (మ.1994)

1917: నముడూరు అప్పలనరసింహం, ప్రఖ్యాత తెలుగు కవి, పండితులు (మ.1986)

1920 - జోస్ లోపెజ్ పోర్టిల్లో, మెక్సికన్ న్యాయవాది, రాజకీయవేత్త, మెక్సికో 31వ అధ్యక్షుడు (మ .2004)

1940: ఇచ్ఛాపురపు రామచంద్రం.. వానజల్లు, ఆకులురాలేకాలం, భట్టి విక్రమార్క కథలు రచించిన రచయిత. బాలసాహిత్యరచయిత. (మ.2016)

1948: వి. హనుమంతరావు / ఉత్పల హనుమంతరావు. రాజకీయవేత్త. కాంగ్రెస్ తరపున ఏపీ నుంచి భారత రాజ్యసభకు ప్రాతినిథ్యము వహిస్తున్నారు.

1949: విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, సంస్కృత పండితులు.

1950 - మిథున్ చక్రవర్తి, భారత నటుడు, రాజకీయవేత్త.

1951: పూసపాటి అశోక్ గజపతి రాజు, రాజకీయ నాయకులు, విమానయాన కేంద్ర మంత్రి.

1954 - మాథ్యూ సాద్ ముహమ్మద్, అమెరికన్ బాక్సర్, శిక్షకుడు (మ .2014)

1959: జేమ్స్ బ్రియాన్ హెల్విగ్, (రింగ్ పేరు అల్టిమేట్ వారియర్), అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్.

1986: అంజలి, భారతీయ నటి, మోడల్. ఆమె ప్రధానంగా తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తారు.

1994: ఆర్య అంబేద్కర్, మరాఠీ ఫిల్మ్ సింగర్.

మరణాలు:

1925 - చిత్తరంజన్ దాస్, భారత న్యాయవాది, రాజకీయవేత్త (జ .1870)

1930 - ఎల్మెర్ ఆంబ్రోస్ స్పెర్రీ, అమెరికన్ ఆవిష్కర్త, గైరోకాంపాస్‌ను ఆవిష్కరించారు (జ .1860)

1979 - నికోలస్ రే, అమెరికన్ నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్, రెబల్ వితౌట్ ఎ కాస్ సినిమా రూపొందించి బాగా పేరు తెచ్చుకున్నారు. (జ .1911)


సంఘటనలు:

1903: ప్రస్తుత వరల్డ్ పాపులర్ ఫోర్డ్ కార్లను మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ 'ఫోర్డ్ మోటారు' ని అమెరికాలో స్థాపించారు.

1911 - న్యూయార్క్‌లోని ఎండికాట్‌లో కంప్యూటింగ్-టాబులేటింగ్-రికార్డింగ్ కంపెనీగా ఐబిఎం స్థాపించబడింది.

1976: ఏపీ 8వ గవర్నర్ గా ఆర్.డి. భండారి ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన 1976 జూన్ 16 నుంచి 1977 ఫిబ్రవరి 16 వరకు పదవిలో కొనసాగారు.

1944: జార్జ్ జూనియస్ స్టిన్నే జూనియర్(14), ఇద్దరు శ్వేత జాతి బాలికలపై అత్యాచారం చేసి హత్య చేసాడని నేర ఆరోపణలు ఎదుర్కొన్నాడు. రెండు గంటల విచారణలో అతడిని కోర్టు దోషిగా తేల్చింది. తరువాత యునైటెడ్ స్టేట్స్ లో అతనికి మరణ శిక్ష విధించారు. జూన్ 16, 1944లో అతన్ని ఎలక్ట్రిక్ కుర్చీలో కట్టేసి చంపేశారు. 20వ శతాబ్దంలో మరణ శిక్ష అనుభవించిన అమెరికన్స్ లో జార్జ్ జూనియస్ స్టిన్నే అతి పిన్న వయస్కుడు అయ్యాడు.

1963: సోవియట్ స్పేస్ ప్రోగ్రాం: వోస్టాక్ 6 మిషన్: కాస్మోనాట్ వాలెంటినా తెరేష్కోవా అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి మహిళ అయ్యారు.

2001: అప్పటి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దేవాదుల ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు.

పండుగలు, జాతీయ దినాలు:

యువజన దినోత్సవం (దక్షిణాఫ్రికా)

మరింత సమాచారం తెలుసుకోండి: