కేజిఎఫ్, కోలార్ గోల్డ్ బ్యాంక్స్, బంగారు గనుల సామ్రాజ్యం, పద్మనాభ స్వామి టెంపుల్. లెక్కలేనంత సిరులు అక్కడ ఉన్నాయన్నది వాదన. దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో చోట్ల నిధుల అన్వేషణలో లంకెబిందెలు ఉన్నాయని కొందరు అంటున్నారు. నిధుల వేట సాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద నిధి కోసం 12 మంది సభ్యుల బృందం అన్వేషిస్తోంది. అతి త్వరలో దొరక పోతుందని కాన్ఫిడెంట్గా చెబుతోంది. 34 ఏళ్లుగా అన్వేషణ, అక్షరాల లక్షన్నర కోట్ల నిధి ఉంటుందని అంచనా. గుప్తనిధుల కోసం మూడు దశాబ్దాల ప్రయత్నం, కెంపులు, పగడాలు, వజ్రాలు,పసిడి విగ్రహాలు ఉన్నాయని నమ్మకం. టెంపుల్ ట్వేల్వ్ టీం వేట ఫలించ బోతోందా..?

ఇండియా తో పాటు చాలా దేశాల్లో నిధుల వేట ఇప్పటికీ ఎప్పటికీ  ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్. కానీ ఈ నిధి మాత్రం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. 34 ఏళ్లుగా సాగుతున్న నిధి అన్వేషణ ఇప్పుడు కొలిక్కి వస్తోంది. అదే ట్రెజర్ బయటపెడితే ప్రపంచంలోని అత్యంత పెద్ద గుప్తనిధుల వేట గా  చరిత్రలో నిలిచిపోతుంది. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకికి 20 మైళ్ళ, దూరం.లెమ్మిన్ కినేన్  హార్డ్ దేవాలయం, ఈ దేవాలయంలోనే నిధులు ఉన్నాయట. టెంపుల్ ట్వేల్వ్ అనే టీం మూడు దశాబ్దాలుగా ఈ గుడిలోనే బ్రదర్ కోసం హంట్ చేస్తోందట. ఇందులో 18 క్యారట్ల  బంగారంతో తయారుచేసిన విగ్రహాలు ఉన్నాయని భావన. 1987లో టెంపుల్స్ బృందం ట్రెజర్  కోసం వెతుకులాట మొదలెట్టింది. దాతల సహాయంతో తవ్వకాలు తావ్విస్తోంది. చునేలా నది తీరాన ఉన్న ఈ పర్వత ప్రాంతంలో చలికాలంలో మంచు గడ్డ కట్టి పోయుంటుంది. ఎండాకాలంలో కరిగే ఆ నీరు గుహ అంతా నిండిపోతుంది. సమ్మర్ దాకా ఎదురు చూసి 10 లక్షల లీటర్ల నీటిని తోడి తవ్వకాలు జరుపుతున్నారు. ఫిన్లాండ్ లో బాగా పాపులర్ వ్యక్తి లెమ్మిన్ కెనిన్, ఫినిష్ పురాణాల్లో ప్రముఖుడు. ఫిన్లాండ్ రాజధానిలో గుహల్లో ఆయన ధ్యానం చేసుకుంటూ గడిపారట అక్కడే శేషకాలం గడిపాడట. ఆయనకు అనేక మహిమలున్నాయని స్థానిక ప్రజల నమ్మకం. అందుకే ఆయన పేరు మీద అక్కడి గుహల్లో దేవాలయం కూడా నిర్మించారట. ఆ గుహలోనే ఆయనకు సంబంధించిన నిధులు ఉన్నాయనేది నమ్మకం.

 ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిశోధించారు కాబట్టే నమ్మకంతో శోధిస్తున్నారని తెలుస్తోంది. అయితే నిధి ఉంటుందన్న గ్యారెంటీ కూడా లేదనే వారు ఉన్నారు. కేవలం ఇది ఒక ఊహ మాత్రమే నని చెబుతున్నారు. చూడాలి టెంపుల్ ట్వేల్వ్ టీం ట్రెజర్ హంట్ ఫలిస్తుందో, మూడు దశాబ్దాల శ్రమను బూడిదలో పోసిన పన్నీరు చేస్తుందో ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: